బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం రామోజి ఫిల్మ్ సిటీలో జరిగింది. సినిమాకు ఐదేళ్లు కష్టపడి పనిచేసిన టెక్నికల్ టీం అందరికి జక్కన్న మార్క్ అప్రిషియేషన్ దక్కింది. ఇక నిన్న మాట్లాడిన వారందరిలో కీరవాణి స్పీచ్ హైలెట్ గా నిలవడం విశేషం. ఎప్పుడు సైలెంట్ గా మాట్లాడే కీరవాణి నిన్న కాస్త సర్ ప్రైజింగ్ గా మాట్లాడారు.


బాహుబలి హీరో ప్రభాస్ గురించ్ చెబుతూ ప్రభాస్ కు చేతకాని విషయాల గురించి సంచల వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ అందరి హీరోల్లా స్టైల్ కొట్టేవాడు కాదని.. చాలా సరదాగా ఉండే మనిషని.. స్టార్ అంటే ఒక హీరోని చూస్తే ఎడమొహం చూపించేస్తారని.. కాని అలాంటి కంత్రి వాడు ప్రభాస్ కాదని కీరవాణి అన్నాడు.


ఇక రాజమౌళికైతే ఎవ్వడంట ఎవ్వడంట స్పెషల్ సాంగ్ రాజమౌళి మీద కంపోజ్ చేసి కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు కీరవాణి. బాహుబలి-2 సినిమాలో తాను చాలా పెద్ద పాత్రే పోశించానని.. కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు సాంగ్ రాయడం కూడా జరిగిందని అన్నారు కీరవాణి. కచ్చితంగా ప్రేక్షకులు బాహుబలి-2 కూడా మంచి సినిమా అవుతుందని అన్నారు.


అయితే మిగతా హీరోలను పోలుస్తూ ప్రభాస్ ను పొగిడిన కీరవాణి మరి అలాంటి వ్యక్తిత్వం ఉన్న స్టార్ హీరోలకు చురకలేశాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా కీరవాణి ఎన్నడు లేని జోష్ ఫుల్ స్పీచ్ తో బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: