బాహుబలి తో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. బాహుబలికి ముంచు ప్రభాస్ ఓ ప్రాంతీయ హీరో కాని ఎప్పుడైతే బిగినింగ్ రిలీజ్ అయ్యిందో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. అదే విషయం గుర్తుచేశాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ సమయంలో బాంబేలో ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశామని.. అక్కడకెళ్లగానే ప్రభాస్ ను చూసి మీడియా వాళ్లు కేకలేశారని అన్నాడు రాజమౌళి.


సినిమా కోసం తన ఐదేళ్ల కెరియర్ ను కూడా లెక్క చేయలేదు ప్రభాస్. ఓ తెలుగు హీరోని చూసి బాంబేలో కేకలేశారంటే ఇక ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇదవరకు తెలుగు సినిమాలు బాలీవుడ్లో డబ్ అవుతున్నా బాహుబలి రేంజ్లో ఏ సినిమాకు ఆదరణ దక్కలేదు. బాహుబలి తెలుగు సినిమా కాదు ఇది ఇండియన్ సినిమా అని చెప్పుకుని గర్వపడేలా ఉందంటున్నారు.


రెండేళ్ల నుండి ప్రపంచంలో కేవలం తెలుగు వాళ్లే కాదు సినిమా అభిమానులంతా కూడా బాహుబలి సినిమా గురించి మాట్లాడుతున్నారని నిన్న స్పీచ్ ఇచ్చిన వారిలో అన్నారు. నిజంగానే బాహుబలి ఆ రేంజ్ కు వెళ్లింది. సినిమా ఎప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉంది. అందుకే ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూయర్ కౌంట్ సాధించింది.


అంతేకాదు 100 మిలియన్ వ్యూయర్స్ తో ఇండియన్ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమాల్లోనే ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది బాహుబలి-2. మొదటి పార్ట్ ఎంతటి సక్సెస్ అయ్యిందో సెకండ్ పార్ట్ అంతకుమించి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు. ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: