దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోయిన్స్ ను అత్యంత గ్లామర్ గా చూపించడంలో అందెవేసిన చేయి. దీనితో రాఘవేంద్రరావు సినిమాలలో నటిస్తే తమ హీరోయిన్ కెరియర్ కు ఊహించని మలుపు వస్తుంది అని హీరోయిన్స్ అంతా భావిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన ‘బాహుబలి 2 ఈ వెంట లో రాఘవేంద్రరావు అనుష్క తమన్నాలను ఉద్దేసించి చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. 

దర్శకేంద్రుడు ఈవిధంగా కామెంట్ చేయడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. నిన్న జరిగిన ఈవెంట్ లో వేదికపైకి వచ్చి మాట్లాడటానికి కృష్ణంరాజును ఆహ్వానించినప్పుడు ఆయనకు పెరిగిన వయస్సు రీత్యా అంత భారీ స్టేజ్ మెట్లను ఎక్కడానికి చాల ఇబ్బంది పడ్డాడు కృష్ణంరాజు. 

అయితే కృష్ణంరాజు పడుతున్న ఇబ్బందిని గ్రహించిన ప్రభాస్ వెంటనే లేచి వచ్చి కృష్ణంరాజును నెమ్మదిగా వేదిక పైకి తీసుకు వచ్చాడు ప్రభాస్. ఈ సంఘటనను చూసిన రాఘవేంద్రరావు మరొక విధంగా వ్యాఖ్యానిస్తూ యాంకర్ సుమతో ఒక జోక్ చేసాడు. ‘అక్కడ కృష్ణంరాజును పైకి తీసుకురావడానికి ప్రభాస్ వచ్చాడు కదా.. మరి నాకోసం అనుష్క.. తమన్నా వస్తే బాగుండేదిగా’ అంటూ జోక్ చేసాడు దర్శకేంద్రుడు.

దీనితో ఆ జోక్ కు షాక్ అయిన యాంకర్ సుమ అనుష్క వైపు చూస్తూ ‘అనుష్కా నువ్వు వస్తే బెటర్’ అని సుమ చెప్పడంతో రాఘవేంద్రరావు తన ఉపన్యాసం ముగించుకుని స్టేజ్ దిగి వెళుతున్నప్పుడు అనుష్క నిజంగానే రాఘవేంద్రరావుకు మెట్లు దిగడానికి సహాయం చేసింది. ఇంతలోనే ఆమె వెంట తాను కూడ ఉన్నాను అంటూ తమన్నా కూడ పరిగెత్తుకుంటూ రావడంతో మీడియా కెమెరాలు అన్నీ ఈ ముగ్గురి పై ఫోకస్ పెట్టాయి.

దీనితో ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులు రాఘవేంద్రరావుకు వయస్సు పెరిగినా ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ ఇంకా చైతన్యవంతంగానే ఉంది అని కామెంట్ చేసుకున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: