నిన్న ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఒక టాప్ హీరో సినిమా ఫంక్షన్ లా కాకుండా చాల వ్యూహాత్మకంగా ఎటువంటి హీరో భజన కార్యక్రమాలు లేకుండా కేవలం ‘బాహుబలి’ సినిమాతో తమకు ఏర్పడిన అనుబంధాన్ని వివరిస్తూ నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అంతేకాదు ఇప్పట్లో ఇటువంటి స్థాయిలో మరో సినిమా ఫంక్షన్ జరిగే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ కూడ వినిపించాయి. 

సామాన్యంగా టాప్ హీరోల సినిమాల ఫంక్షన్స్ లో కనిపించే గోలలు అరుపులు లేకుండా కేవలం అత్యంత ఆత్మీయమైన వాతావరణంతో భావోద్వేగాలను పండిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతివారు రాజమౌళి సమర్ధతకు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఒక ఉదాహరణగా మారింది అని కామెంట్స్ చేసుకోవడం స్పష్టంగా వినిపించింది. ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఎదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ఇచ్చివేసాము అని తప్పించుకోకుండా రాజమౌళి కుటుంబం అంతా తమ ఇంటి పెళ్ళి వేడుకలా ఈ ఫంక్షన్ లో ఇన్వాల్వ్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
  
అంతేకాదు ఈ ఈవెంట్ లో మాట్లాడిన ప్రతివారి మాటల్లోనూ కేవలం ముఖస్తుతి కాకుండా ‘బాహుబలి’ ప్రాజేక్ట్  పట్ల తమకు ఉన్న అభిమానం ముఖ్యంగా రాజమౌళి పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ చేసిన ప్రశంగాలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. ఇంత భారీ ఫంక్షన్ ను ఎటువంటి గొడవలు వివాదాలు లేకుండా నిర్వహించడం ఒక్క రాజమౌళికే చెల్లింది అంటూ చాలామంది కామెంట్స్ చేసారు. 

ఈ ఫంక్షన్ జరుగుతున్నంత సేపు ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి నుండి కెమెరా లైట్ బాయ్ వరకు అందరూ ఇది తమ ఫంక్షన్ అని అనుకున్నట్లుగా చూపించిన టీమ్ స్పిరిట్ రాజమౌళి సమర్ధతకు నిదర్శనం అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి అయితే తన స్పీచ్ లో ఈ సినిమా కోసం ప్రీ లుక్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ ల దగ్గర నుంచి  టీలు అందించిన ప్రొడక్షన్ కుర్రాళ్ళు, సెట్లకు రంగులు వేసిన వర్కర్స్ ఫైట్స్ కంపోజింగ్ లో సాయం చేసిన ఫైట్ మాష్టర్లు, సాంగ్స్ తీయడంలో సాయం చేసిన కొరియోగ్రాఫర్లు ఇలా అందర్నీ పేరు పేరునా గుర్తుకు చేసుకుంటూ రాజమౌళి వ్యూహాత్మకంగా చేసిన ప్రసంగం అందరి మన్ననలు పొందింది.  
ఒక విధంగా ఆలోచిస్తే మహాకవి శ్రీశ్రీ తాజమహల్ నిర్మాణానికి రాళ్ళు మోసిన కూలీలను గుర్తుకు చేసుకున్న విధంగా రాజమౌళి తన ‘బాహుబలి’ మహా యజ్ఞానికి అన్ని విధాల సహకరించిన ఎందరికో తన ఉద్వేగపూరితమైన భావాలతో కృతజ్ఞతలు తెలియచేయడం రాజమౌళి సంస్కారానికి చిహ్నం అంటూ పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: