బాహుబలి సినిమా ప్రభాస్ కు ఎంత పేరు తెచ్చి పెట్టిందో అదే రేంజ్ ఫాలోయింగ్ దగ్గుబాటి హీరో రానాకి అంతే క్రేజ్ తెచ్చింది. ఓ రకంగా బాలీవుడ్ లో ఇప్పటికే పరిచయమున్న రానా మొదటి పార్ట్ అంత బాగా వర్క్ అవుట్ అయ్యేందుకు సహకరించాడని చెప్పొచ్చు. ఇక నిన్న జరిగిన బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా స్పీచ్ అందరిని ఆశ్చర్య పరిచింది.


తనకు కొంత సంతోషం కొంత భాధ ఉన్నాయని మొదలుపెట్టిన రానా ఇంత ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో భాగమయ్యినందుకు తనకు సంతోషంగా ఉందని.. రెండున్నర ఏళ్ల క్రితం చెప్పా మీరో గొప్ప సినిమా చూడబోతున్నారని.. అలానే సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు రాబోతున్న సెకండ్ పార్ట్ అంతకుమించి ఉంటుంది ఇది కూడా అంతకన్నా ఎక్కువ రేంజ్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. తను ఎన్ని సినిమాలు చేసినా తన కో స్టార్ గా మాత్రం ప్రభాసే తన ఫేవరేట్ అని అన్నాడు రానా.


ఇక భాధ ఎందుకు అంటే మళ్లీ ఈ మాహిశ్మతి సామ్రాజ్యం చూసే వీలు లేదు. ఐదేళ్లు ఫ్యామిలీలా కలిసి పనిచేసిన చిత్రయూనిట్ తో మళ్లీ ఎప్పుడు కలుస్తామో అని భాధగా ఉందని అన్నారు రానా.  కొన్ని సార్లు కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తను చేసిన తప్పులను నెలకోసారి చీవాట్లు పెట్టే శ్రీవల్లి గారు రోజుకో రెండు రోజులకో మాములుగా అయినా ఫోన్ చేసి మాట్లాడతారని ఆశిస్తున్నా అని చమత్కరించాడు రానా. 


ఫైనల్ గా ఏప్రిల్ 28న వస్తున్నా వేడుకకు సిద్ధమా అని మరోసారి తన మార్క్ స్పీచ్ తో అదరగొట్టాడు రానా. రీసెంట్ గా ఘాజి సినిమాతో హిట్ అందుకున్న రానా బాహుబలిలో భళ్లాలదేవుడిగా చేస్తున్నాడు. బాహుబలికి తగ్గ విలన్ అయిన భళ్లీలుడు పార్ట్ 2లో తన విశ్వరూపం చూపించబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: