తెలుగు ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారారు సునీల్.  ఇక రాజమౌళి ‘మర్యాద రామన్న’ చిత్రంతో మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకున్నా గత సంవత్సరం రిలీజ్ అయిన 'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్.  ఇక ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు.
Image result
ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. .ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై   చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం టీజ‌ర్ ని ఉగాదిశుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయ‌నున్నారు.  స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Image result for ungarala rambabu posters
అతిత్వ‌ర‌లోనే ఆడియోని విడుద‌ల చేసి, స‌మ్మ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు.
సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున



మరింత సమాచారం తెలుసుకోండి: