భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్న అద్భుతాలు సృష్టించిన అద్భుతమైన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్గంగా కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ సత్తా ఎంటో ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారు జక్కన్న. అప్పటి వరకు బాలీవుడ్,కోలీవుడ్ చిత్రాకు మాత్రమే సొంతమైన రూ.200 కోట్ల టార్గెట్ ని బాహుబలి 600 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది.
 ఇక జాతీయ స్థాయిలో నటీ నటులకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి టెక్నికల్ గా ఎంత హంగులు ఆర్భాటాలు చేసినా..మ్యూజిక్ మంత్రం ఎంతగానో పనిచేసింది. ఎంఎంకీరవాణి తనదైన ముద్ర వేశారు. అద్భుతమైన ట్యూన్స్ లో ప్రతి పాట గుండెలకు హత్తుకునేలా పాటలకు ప్రాణం పోశారు.
తాజాగా ఈ చిత్రంనికి సంబంధించి సీక్వెల్ ‘బాహుబలి 2’ వస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, ట్రైలర్ తో దుమ్మురేపుతుండగా..నిన్న ఆడియో రిలీజ్ మరింత ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. ఈ పాటలు విన్న ప్రతి ఒక్కరూ..సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు. బాహుబలి కన్నా బాహుబలి 2 పాటలు ఇంకా బాగున్నాయని టాక్ వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాటలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

1. సాహోరే బాహుబలి :

ఈ పాట బాహబలి వీరత్వాన్ని గురించి సాగుతుంది..భలి..భలిరా భలి.. అంటూ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంతే కాదు శివగామి మాత గొప్ప తనాన్ని కూడా చాటి చెప్పేవిధంగా ఉంది. అద్భుతమైన సాహిత్యంతో కీరవాణి చాలా బాగా ట్యూన్ చేశారు. 

2. హంసనావ :

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో తమన్నాతో వచ్చిన రొమాంటిక్ సాంగ్ ఎంతబాగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాటలో అనుష్క కూడా చాలా అందంగా చూపించారు. ఇద్దరి మద్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూస్తుంటే..మై మరచి పోవాల్సిందే. 

3. కృష్ణా నిదురించరా :

ఈ పాటలో సంగీతం..పిక్చరైజేషన్ ఎంతో అద్భుతమంగా ఉంది. అనుష్క చిన్ని కృష్ణుడి కోసం పాడుతున్న పాట అందరినీ ఆకర్షించే విధంగా ఉంది. అంతే కాదు ఈ పాటలో అనుష్క చాలా అందంగా చూపించారు. 

4.దండాలయ్యా :

ఈ పాట బాహబలి రాజు యొక్క గొప్ప తనాన్ని చూపిస్తుంది. మొదటి భాగంలో బాహుబలి ని రాజుగా చేసిన తర్వాత రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నపుడు బాహుబలి గొప్ప తనాన్ని ప్రశంసిస్తూ సాగే పాట. 

5. ఒక ప్రాణం :

ఈ పాటలో కట్టప వెన్ను పోటుకి సంబంధించిన దృష్యాలతో హృదయ విదారకంగా కనిపిస్తుంది. 

బాహుబలి 2 : రేటింగ్ : 2.5

మరింత సమాచారం తెలుసుకోండి: