యాంకర్ గా బుల్లితెర మీద తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి అడపాదడపా సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపించి అలరిస్తుంది. బాబు బాగా బిజీలో కాస్త ఎక్కువ రోల్ చేస్తున్న శ్రీముఖి ఐటం సాంగ్ ఆఫర్ ను కూడా చేసే అవకాశం జస్ట్ లో మిస్ అయ్యిందట. ఐటం సాంగ్ కు హాట్ యాంకర్ల హవా కొనసాగుతుంది.


ఇప్పటికే అనసూయ ఆ క్రేజ్ తోనే ఐటం సాంగ్ చేయగా రష్మి ఐటం కు రెడీ అవుతుంది. ఇక వారిద్దరితో పాటు సేం ఇమేజ్ ఉన్న శ్రీముఖి కూడా ఐటంగా అదరగొట్టేందుకు రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తుంది. శ్రీనువైట్ల డైరక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ సినిమాలో హాట్ ఐటం గా శ్రీముఖిని ముందు అనుకున్నారట. కాని వరుణ్ పక్కన హైట్ ప్రాబ్లెం ఉండబట్టి శ్రీముఖిని తప్పించారని ఫిల్మ్ నగర్ టాక్. 


స్మాల్ స్క్రీన్ పై సరదా యాంకరింగ్ తో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన పట్టు సాధించాలని చూస్తుంది. అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు. ప్రస్తుతం బాబు బాగ బిజీలో హాట్ హాట్ గా కనిపించనున్న శ్రీముఖి ఆ సినిమాతో కచ్చితంగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకోవడం గ్యారెంటీ అంటున్నారు.


ఇక కెరియర్ మొదట్లో హీరోయిన్ గా ట్రై చేసినా ఇప్పుడున్న స్పెషల్ క్రేజ్ తో మళ్లీ అమ్మడు సోలో హీరోయిన్ గా చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. మరి వాటిని కూడా శ్రీముఖి ఓకే అనాలని చూస్తుందట. యాంకర్ టర్నెడ్ హీరోయిన్ గా మళ్లీ ఫాంలోకి వచ్చిన శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఐటం మిస్ అయిన ఏదో ఒక హాట్ ఐటం తో శ్రీముఖి మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: