నిన్న జరిగిన ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భల్లాలదేవుడు రానాకి తీవ్ర పరాభవం ఎదురైంది అంటూ వార్తలు హడావిడి చేయడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి రోజున ప్రభాస్ రాకతో మొదలైన ఈ పరాభవాల పరంపర ప్రోగ్రామ్ ఆద్యంతం కొనసాగుతూనే ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉండటం మరింత సంచలనంగా మారింది.

ఈవిధంగా ఇలాంటి కామెంట్స్ నిన్నటి కార్యక్రమం పై రావడానికి ఒక ఆసక్తికర కారణం కనిపిస్తోంది. నిన్న జరిగిన ‘బాహుబలి 2’ ప్రోగ్రామ్ మొత్తం ఫ్యామిలీ ఫంక్షన్లా మారిపోయిందని కొందరంటుంటే వేడుకలో మొత్తం రాజమౌళి, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, ‘బాహుబలి’ సినిమా ప్రొడ్యూసర్స్, హీరో ప్రభాస్ ని ఆకాశానికెత్తడంతోనే సరిపోయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

దీనితో ప్రభాస్ కు సరిజోడుగా నువ్వానేనా అన్నరీతిలో నటించిన రానా దగ్గుబాటికి నిన్నటి ‘బాహుబలి 2’ ఫంక్షన్ లో తీవ్ర పరాభవం ఎదురైందని అంటూ రానా సన్నిహితులు ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డ రానా గురించి రాజమౌళి తన ఉపన్యాసంలో సరిగ్గా ప్రస్తావించకపోవడం మరింత షాకింగ్ గా మారింది అంటూ రానా సన్నిహితులు గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు ఇచ్చిన  విజయేంద్రప్రసాద్, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, కీరవాణి ఇలా అందరూ ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రానా ను పూర్తిగా మర్చిపోవడం ఒక విధంగా రానాకు కూడ షాకింగ్ గా మారింది అని టాక్. మరి ఈ గాసిప్పులు రాజమౌళి దృష్టి వరకు వెళతాయి కాబట్టి ఈసినిమాకు సంబంధించిన భవిష్యత్ ప్రమోషన్ కార్యక్రమాలలో రానాకు రాజమౌళి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: