‘బాహుబలి 2’ పాటలు విడుదలై అప్పుడే రెండు రోజులు గడిచిపోయినా ఇంకా అవి ట్రెండ్ సెటర్స్ గా మారకపోవడం ఈమూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి సంగీత దర్శకత్వ స్థాయికి తగ్గట్టుగా ఈ పాటలు లేవు అని కామెంట్స్ రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

ఈమూవీలో ఉన్న పాటలలో ఒక్క డ్యూయెట్ సంబంధించి మిగతా పాటలు అన్నీ ఆసినిమాలో వచ్చే సన్నివేశాల సందర్భాలను బట్టి వచ్చే పాటలు. దీనితో కేవలం ఆడియో పరంగా తీసుకుంటే ఈపాటల ట్యూన్స్ అంత క్యాచీగా లేవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘బలి బలేరా బాలి .. సాహోరే బాహుబలి’ పాట ఒక్కటే సాధారణ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోయే పాటలా వినిపిస్తోంది అని అంటున్నారు.

ఇక అనుష్క ప్రభాస్ లపై చిత్రీకరించిన ‘హంస నావ’ డ్యూయెట్ సాంగ్ ట్యూన్ ఏమాత్రం క్యాచింగ్ గా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ‘కన్నా నిదురించ రా’ పాట చాల క్లాసికల్ టచ్ తో ఉండటంతో ఈపాట ఎంత వరకు సామాన్య ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ‘దండాలయ్యా’ అంటూ వినిపిస్తున్న పాటలో ఎమోషనల్ టచ్ ఉన్నా ఈ పాట ట్యూన్ కూడ అంత క్యాచీగా లేదు అన్న కామెంట్స్ సామాన్య ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. అదేవిధంగా ‘ఒక ప్రాణం’ పాట ట్యూన్ కూడ సందర్భానుసారం వచ్చే పాట ట్యూన్ లా అనిపిస్తోంది కాని క్యాచీగా లేదు అన్న కామెంట్స్ చాలామంది దగ్గర నుంచి వస్తున్నాయి.

కీరవాణి ‘బాహుబలి’ బిగినింగ్ కోసం అందించిన పాటల ట్యూన్స్ తో పోలిస్తే ‘బాహుబలి 2’ లో పాటలు ఆడియో పరంగా అంతగా సక్సస్ కావేమో అన్న అనుమానాలను విమర్శకులు కూడ వ్యక్త పరుస్తున్నారు. అయితే ‘బాహుబలి 2’ కు గ్రాఫిక్స్ గుండెకాయ లాంటివి కాబట్టి ఈసినిమా విడుదల అయ్యాక ఆ గ్రాఫిక్స్ వండర్ మాయలో సాధారణ ప్రేక్షకుడు తన్మయత్వంతో ‘బాహుబలి 2’ ను చూస్తున్నప్పుడు కీరవాణి ఈసినిమాకు అందించిన ట్యూన్స్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి..
 
 ‘



మరింత సమాచారం తెలుసుకోండి: