బాహుబలి-2 ట్రైలర్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అయితే ఈ ట్రైలర్ కోసం రాజమౌళి దాదాపు ఎడిటింగ్ టీం అంతటిని చాలా ఇబ్బంది పెట్టాడట. రాజమౌళి తనయుడు కార్తికేయ ఆధ్వర్యంలో ఈ ట్రైలర్ కట్ చేయడం జరిగింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న జక్కన్న ట్రైలర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడట.


కార్తికేయ ఓ రఫ్ కట్ చేయించి తెచ్చాడట.. దాన్ని చూసి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఫైనల్ గా ఈ ట్రైలర్ ఓకే చేశారట. అయితే దీనికి ముందు దాదాపు 25 వర్షన్ ట్రైలర్ కట్ చేశారట రాజమౌళి అండ్ టీం. వాటన్నిటిలో ఈ ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించడంతో ఇది రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో విషయం ఏంటంటే బిగినింగ్ లో కాలకేయున్ని చంపి రాజు అవుతాడు బాహుబలి.


అందుకే ప్రమాణ స్వీకారంతో ట్రైలర్ మొదలవుతుంది.. ఆ తర్వాత మొదటి పార్ట్ మొత్తం కట్ షాట్స్ లో చూపించేస్తారు. ఫైనల్ గా అంతర్ యుద్ధం గురించి కూడా పార్ట్-2 లో ఉండే భారీ ఫైట్స్ మొత్తం 2 నిమిషాల ట్రైలర్ లో చూపి వారెవా అనేలా చేశారు. రీసెంట్ గా బాహుబలి-2 ప్రె రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ 25 వర్షన్స్ రెడీ చేశామని రాజమౌళి చెప్పడం జరిగింది.


ట్రైలెర్ కోసమే ఇంత కష్టపడిన రాజమౌళి సినిమా కోసం ఇంకెంత కష్టపడి ఉంటాడో అర్ధమవుతుంది. ప్రపంచం మొత్తం ఇండియన్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేస్తున్న బాహుబలి-2 రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాహుబలి నెలకొలిపే రికార్డులన్నిటికి ప్రేక్షకులే సాక్ష్యంగా ఉండి తీరుతారని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: