సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన మూవీ ‘బాషా’ ఈసినిమా విడుదలై 25 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఈసినిమా దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ఒక ట్రెండ్ సెటర్. ఇప్పుడు ఈసినిమా ప్రభావం పూరీ జగన్నాథ్ బాలకృష్ణతో తీయబోతున్న సినిమా పై ఉండబోతోంది అన్న ప్రచారం జరగబోతోంది.

ఇక లేటెస్ట్ గా పూరి తాను బాలయ్యతో తీయబోతున్న సినిమా విషయమై ఇస్తున్న లీకులు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని టాక్. దీనికోసం బాలయ్య గెటప్ హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాలలోను మార్పులు చేయడానికి పూరి భారీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా బాలకృష్ణ హెయిర్ స్టైల్ కు సంబంధించి సలహాలు ఇవ్వడానికి ముంబాయికి చెందిన కొంతమంది హెయిర్ స్టైల్ ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈమూవీకి సంబంధించి బాలయ్య లుక్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయమై పూరి ఒక ఫోటో షూట్ ను కూడ ఇప్పటికే తీసినట్లు సమాచారం. 

ఈమూవీలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అయితే వారిద్దరూ కూడ ముంబాయి నుండి దిగుమతి అయిన కొత్త అమ్మాయిలు అని అంటున్నారు. ఇప్పటికే పూర్తి అయిన ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ లో ఈ కొత్త అమ్మాయిలు నటించారు అనే వార్తలు కూడ వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ అన్వేషణలో పూరి ఉన్నట్లు సమాచారం. అయితే ఈమధ్యనే ఈసినిమాకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన ‘టపోరి’ అన్న టైటిల్ వార్తలను పూరి ఖండిస్తున్నాడు. ఏది ఏమైనా బాలయ్యను గ్యాంగ్ స్టర్ గా చూపించాలి అన్న పూరి జగన్నాథ్ ప్రయత్నాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: