తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ తర్వాత ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది.  ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు అయ్యాడు ప్రభాస్.  అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
Related image
ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ బాహుబలి 2 చిత్రం త్వరలో రాబోతుంది.  అలాంటి బాహుబలి హీరో ప్రభాస్ ని ఏకంగా హీరో కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి.  మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో  ప్రభాస్ తో తనుకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ..అసలు ప్రభాస్ హీరో కాదు ఎందుకంటే..... అతడిలో అహం లేదు , ఫోజు కొట్టడం రాదు .. స్టైల్ కొట్టడు పైగా బిల్డప్ లేని హీరో ఇక ఇతడ్ని హీరో అని ఎలాగంటాం అని షాక్ ఇచ్చాడు.  అయితే మొదట కీరవాణి ప్రభాస్ అసలు హీరో కాదు అనగానే అంతా షాక్ అయ్యారు..ఒక్కసారే సైలెంట్ అయ్యారు.  
Image result for బాహుబలి 2  ప్రీ రిలీజ్
కానీ తర్వాత త వరుసగా ప్రభాస్ లో ఉన్న సుగుణాలు అన్ని ఏకరువు పెడుతుండటంతో చప్పట్ల మోతలు మోగాయి. ఇక ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్న సమయంలో ఫ్యాన్స్ అంతా హుషారుగా ఈలలు వేస్తుండటం తో ప్రభాస్ ముసిముసి నవ్వులు నవ్వుతు తెగ ఇదై పోయాడు. మొత్తానికి బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా తన తోటి నటులు కూడా తెగ పొగిడేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: