సామాన్యంగా పండుగలకు అదేవిధంగా మంచి ముహూర్తాలకు టాప్ హీరోల సినిమాలు ప్రారంభం అవ్వడం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. అయితే ఫూల్స్ డేగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఏప్రియల్ 1న చరణ్ లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతూ ఉండటం చరణ్ అభిమానులకు షాక్ ఇస్తున్నట్లు టాక్. 

దీనికి కారణం ఎవరినైనా ఆట పట్టించడానికి ఏప్రియల్ ఫస్ట్ రోజున ఫూల్స్ చేస్తూ జోక్ చేస్తూ ఉంటారు. అయినా ఇటువంటి సెంటిమెంట్లు ఏమి పట్టించుకోకుండా సుకుమార్ దర్శకత్వంలో తాను నటించబోయే లేటెస్ట్ మూవీని ఏప్రియల్ 1న మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ చరణ్ మార్చి 20న మొదలు పెట్టాలి అనుకున్నాడు. అయితే చరణ్ ఈసారి తన పుట్టినరోజును తన భార్యతో కలిసి ఒక ఫారిన్ కంట్రీలో జరుపుకున్న నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఏప్రియల్ 1కి వాయిదా వేసారు అని తెలుస్తోంది. ఏప్రిల్ 1 అంటే అందరూ ఫూల్స్ డేగా సెలిబ్రేట్ చేసుకుంటూ ఉంటే చరణ్ మాత్రం ఆరోజు సీరియస్ గా షూటింగ్ స్పాట్ కు వెళ్ళ బోతున్నాడు. 

తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో వేసిన సెట్ లో ఈమూవీ షూటింగ్ ప్రారంభం అవుతోంది. గ్రామీణ ప్రాంతాన్ని ప్రతిబింబించే ఈ భారీ సెట్ లో చరణ్ తో పాటు సమంత కూడా షూటింగ్ లో పాల్గొన బోతోంది.  

ఇప్పటివరకు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను తీసిన సుకుమార్ ఈసారి తన పద్ధతికి భిన్నంగా చరణ్ సినిమా విషయంలో బడ్జెట్ విషయమై పొదుపు పాటిస్తున్నట్లు టాక్. చరణ్ తన కెరియర్ లో మొట్టమొదటి సారిగా ఒక చెవిటి వాడుగా నటిస్తున్న ఈమూవీ కోసం చరణ్ ఒక సరికొత్త లుక్ ను క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఫూల్స్ డేను కూడా పట్టించుకోకుండా చరణ్ తన కెరియర్ గురించి చాల సీరియస్ గా ఉన్నాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: