కెరియర్ అటు ఇటుగా సాగుతున్న తరుణంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలను అందుకున్న కాజల్ లక్కీగా హిట్లు కొడుతూ మళ్లీ మునుపటి ఫాంలోకి వచ్చింది. నిన్నటిదాకా హీరోయిన్ గానే రెచ్చిపోయిన అమ్మడు జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ కూడా చేసేసింది. ఎన్.టి.ఆర్ తో పక్కా లోకల్ సాంగ్ చేసిన కాజల్ ఆ సాంగ్ లో కేక పెట్టించేసింది.


ఇక అదే ఊపుతో మరిన్ని ఐటం ఆఫర్లు అందుకుంది కాజల్. వాటిలో చెబితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఒకటి. కాజల్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేసిన వీరు అమ్మడిని సంప్రదించారట. కాని ఆమె చెప్పిన రెమ్యునరేషన్ తో షాక్ అయ్యారని టాక్. హీరోయిన్ గా కోటికి పైగా తీసుకున్న కాజల్ ఐటం సాంగ్ క్రేజ్ వల్ల దానికి కూడా కోటి ఇస్తేనే అంటుందట.


కాజల్ చెప్పిన కోటి రెమ్యునరేషన్ కు బెల్లంకొండ బాబుకి నోట మాట రాలేదట. కాజల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూసినా అమ్మడు ఒక్క ఐటం సాంగ్ కే ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. హీరోయిన్ గా ఎలాగు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సో చూస్తుంటే కాజల్ కెరియర్ మళ్లీ గాడిలో పడ్డట్టే అనిపిస్తుంది.


మరి కోటి ఇచ్చి కాజల్ తో డ్యాన్స్ ఎందుకని ఆమె ప్లేస్ లో వేరే భామని సెలెక్ట్ చేశారట దర్శక నిర్మాతలు. సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి ఆ వెంటనే కుర్ర హీరో సినిమా డైరెక్ట్ చేయడం విశేషం. సినిమా కూడా కమర్షియల్ గా స్టార్ హీరో రేంజ్లో తీస్తున్నారట. మరి బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: