రేపు ఉగాది పండుగ కావడంతో సెంటిమెంట్ రీత్యా చాలామంది హీరోలు తాము నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ ను విడుదల చేస్తున్నారు. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న నాగచైతన్య ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నాడు. ఇప్పడు ఫిలింనగర్ లో చైతన్య చేస్తున్న ఈ ప్రయోగం పై అప్పుడే చర్చలు కూడ జరుగుతున్నాయి.  

నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న తన కొత్త సినిమాకు సంబంధించి రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రొటీన్ కు భిన్నంగా రేపు చైతన్య తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి రేపు ఒకేసారి 2 ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయబోతున్నాడు.  

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొత్త సినిమాకు సంబంధించి దర్శకుడు కల్యాణ్ కృష్ణ, చైతూ కలిసి ఒక ఫస్ట్ లుక్ లాక్ చేశారు అని తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఈసినిమా ప్రొడ్యూసర్ నాగార్జున మరో లుక్ ఫిక్స్ చేశాడు అని  వార్తలు వస్తున్నాయి. దీనితో ఎవరు ఫిక్స్ చేసిన లుక్ ను రేపు ఉగాది రోజున విడుదల చేయాలో అర్థం కాలేదట చైతన్యకు. దీనితో తన సినిమాకు సంసంబంధించిన రెండు లుక్స్ ను ఒకేసారి విడుదల చేయాలని చైతు డిసైడ్ అయ్యాడు అని తెలుస్తోంది. 

ఇదే విషయాన్ని తన  ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశాడు చైతు. అంతేకాదు తన తండ్రి నాగార్జునకు ఒక  సవాల్ కూడా విసిరాడు. ఎవరు సెలక్ట్ చేసిన లుక్ క్లిక్ అవుతుందో చూసుకుందాం అంటూ ట్వీట్ చేసి నాగార్జునకు సవాల్ విసురుతూ అనుకోని షాక్ ఇచ్చాడు. దీనితో అక్కినేని ఫాన్స్ ఈ తండ్రీ కొడుకుల సవాల్ లో ఎవరిని గెలిపిస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: