ఈ మద్య సినిమా ప్రమోషన్ల కోసం హీరో, హీరోయిన్లు జనాల మద్యలోకి వచ్చి తెగ హంగామా చేస్తూ తమ సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చకుంటున్నారు.   సోషల్ మీడియాలో అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సినిమా గురించి ఊదరగొడుతున్నారు.  ఇక  సినీనటి భావనపై  లైంగిక దాడి జరిగిన తర్వాత ఆమె చూపించిన తెగువ అంతా ఇంతా కాదు. తనపై లైంగిక దాడి జరిపిన దుండగులను  జైలు ఊచలు లెక్కపెట్టే వరకు నిద్రపోలేదు.. అంతే కాదు చాలా మంది హీరోయిన్లను కూడా ఆలోచించేలా చేసింది.  
Image result for piya bajpai hot photos
దీంతో చాలా మంది హీరోయిన్లు తమకు గతంలో జరిగిన అన్యాయాలు, లైంగిక వేధింపుల గురించి బహిరంగానే చర్చిస్తున్నారు.  అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమకు జరిగిన చేదు అనుభవాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ఇండస్ట్రీలో సినిమా చాన్సులు ఇప్పిస్తామని చెప్పి లైంగిక వేధింపులకు గురి చేసిన  దర్శక, నిర్మాతలు కొంత మంది ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.  తాజాగా రంగం డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హాట్ భామ పియా బాజ్ పాయ్ కన్నెత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.  
Image result for piya bajpai hot photos
ఇప్పటి తరం కుర్రాళ్లెవరూ వర్జిన్ (కన్య)లను కోరుకోవట్లేదు. కొద్ది మంది అలా అడుగుతున్నా.. అది కేవలం వారి పెద్దల పై ఉన్న గౌరవం వల్లే. అందుకే చాలా మంది కన్నెపొరను తిరిగి ఏర్పాటు చేసే సర్జరీలను చిన్న నగరాల్లో ఇలాంటివి ఇంకా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.  అంతే కాదు ఈరోజుల్లో కన్యత్వం ఉన్న అమ్మాయిలు లేరని పైగా అబ్బాయిలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే సమయంలో ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పి సంచలనం సృష్టించింది హాట్ భామ పియా బాజ్ పాయ్.  
Image result for piya bajpai hot photos
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన ‘మీర్జా జూలియట్’ సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో పియా బికినీ షూట్లతో హాట్..హాట్‌గా రెచ్చిపోయిన ఈ భామ కుర్రకారుకి గుబులు పుట్టిస్తుంది.  మొత్తానికి సినిమా ప్రమోషన్ సందర్భంగా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: