సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంతవరకు టైటిల్ కూడా కన్ఫాం చేయలేదు. కొద్దిరోజులుగా అన్ని టైటిల్స్ పక్కన పెట్టి స్పైడర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారని అన్నారు. ఇక ఎన్నాళ్ల నుండో ఫ్యాన్స్ ఎదురుచూపులు ఈ ఉగాది రోజున మహేష్ టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. రీసెంట్ గా యప్ టివి ఒరిజినల్ లాంచింగ్ కు వచ్చిన మహేష్ కూడా ఉగాదికి టీజర్ ఉండొచ్చని అన్నాడు.


మరి ఏమైందో ఏమో మళ్లీ ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చేశాడు మహేష్. ఏప్రి 2న చెన్నైలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. ఇక అప్పుడే టీజర్ రిలీజ్ డేట్ కచ్చితంగా చెబుతామని అంటున్నారట. ఈసారి చెప్పిన డేట్ కు కచ్చితంగా టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ రివీల్ చేస్తారట. ఎన్నోసార్లు ఇలా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నా వారిని లెక్క చేయకుండా ఉంటున్న మహేష్ తీరు అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న మహేష్ మురుగదాస్ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది.  


తెలుగు తమిళ భాషల్లోనే కాదు సినిమాను హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగింది. అందుకే మహేష్ ను కూడా నేషనల్ లెవల్ స్టార్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.  


హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమా కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే సినిమా అవుతుఇందని తెలుస్తుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది అనుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందినా సినిమా అంతకుమిచి ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: