అక్కినేని యువ హీరోల్లో నాగార్జున తర్వాత ఆ రేంజ్ కాకపోయినా నాగ చైతన్య కాస్త సక్సెస్ రేటులో బెటర్ అని చెప్పొచ్చు. తడాఖా తర్వాత హిట్ కోసం కష్టపడిన నాగ చైతన్య లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రేమం తో హిట్ కొట్టెయగా ఆ తర్వాత వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం.


కొద్దిరోజులుగా అక్కినేని బ్యానర్లో రిజిస్టర్ చేయబడ్డ ఈ టైటిల్ ముందు అఖిల్ కు అనుకున్నారు కాని నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ అని తెలిసింది. ఈరోజు ఉగాది కానుకగా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే పండుగ ఫీలింగ్ రెట్టింపవడం ఖాయం. సోగ్గాడే చిన్ని నాయన సక్సెస్ తో క్రేజీ డైరక్టర్ గా మారిన కళ్యాణ్ కృష్ణ చైతు కోసం చేస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం.


టైటిల్ చూసే చెప్పొచ్చు ఇది కూడా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలానే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని.. ఇక ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య పంచెకట్టుతో కనిపించగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరికిణీతో చూడముచ్చటగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచేశాడు.  


అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగ్ దేవి కాంబినేషన్ సినిమా మ్యూజికల్ హిట్టే మరి నాగ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు దేవి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలో తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: