కొన్ని రోజుల క్రితం రిలీజైన ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ అప్పట్లో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా నిలవడమే ఆ సినిమా గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది .అయితే ఆ మూవీ ఫిస్ట్ లుక్ లో ఎవరు ఊహించని లుక్ లో దర్శనమిచ్చిన నారా రోహిత్ కూడా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా రోహిత్ మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు అన్న సంకేతాలు ఇచ్చాడు.

అయితే  ‘కథలో రాజకుమారి’ టీమ్ మరో  కొత్త ట్విస్టు ఇచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాగశౌర్యను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు .గతంలో  నారా రోహిత్ ఫస్ట్ లుక్ ను ఎంత భిన్నంగా ప్రెజెంట్ చేశారో ఇప్పడు శౌర్య లుక్ విషయంలోనూ ఇంకో కొత్త వెరైటీ చూపెడుతూ అందరికీ షాక్ ఇచ్చారు.

 ఈ రోజు ఉగాది సందర్భం గా విడుదల చేసిన ఈ మూవీ  టీజర్ లో ఒక  అందమైన సీనరీ చూపించి.. ఆ తర్వాత ఫిలిం ఫేర్ అవార్డుల వేదికను చూపిస్తూ అవార్డు అందుకోవడానికి వెళ్తున్న నాగ శౌర్యను చూపించారు. అంతలో ఏయ్ అంటూఒక  అమ్మాయి పిలుపు వినిపిస్తే.. నన్నా అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు శౌర్య. నిన్నే అంటున్న  అమ్మాయిని  ఎవర్నువ్వు అని శౌర్య అడగ్గానే.. ‘కథలో రాజకుమారి’ అనే టైటిల్ పడుతుంది. 

‘కథలో రాజకుమారి’ మూవీ అంతా సినీ నేపథ్యంలో సాగే కధ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ లో నాగశౌర్య తన నిజ జీవిత పాత్రలోనే కనిపిస్తాడని టాక్. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ లో పాటలు చాలా బాగుంటాయి అన్న ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమాతో మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ వేసవిలో విడుదల కాబోతున్న ఈ మూవీ కుడా అనుకోని సైలెంట్ హిట్ గా మారుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: