రామ్ మొదలుపెట్టాడు : 


హైపర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎట్టకేలకు తన సినిమా ముహుర్తం చేసుకున్నాడు. నేను శైలజ లాంటి సూపర్ హిట్ అందించిన కిశోర్ తిరుమల డైరక్షన్ లోనే రామ్ సినిమా చేస్తుండటం విశేషం. ఈరోజు ప్రాపంభమైన ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని ప్రతి క్యారక్టర్ చాలా లైవ్లీగా ఉంటుందని డైరక్టర్ చెబుతున్నాడు.  

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నేను శైలజ కాంబోలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఆ సినిమా రిజల్ట్ ను రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు రాం ఫ్యాన్స్.


చైతు ఫస్ట్ లుక్ రిలీజ్ : 


అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈరోజు ఉగాది కానుక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 


రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. 


ప్రీ పోన్ అవుతున్న మిస్టర్ : 


మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్. ఏప్రిల్ 14న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా ఓరోజు ముందుకు ప్రీ పోన్ అవుతుంది. ఏప్రిల్ 14న మిగతా సినిమాల రిలీజ్ కు కూడా ఉండటంతో వాటికంటే ముందు ఓరోజు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారట నిర్మాతలు.


వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల తన సత్తా చాటాలని ఈ మిస్టర్ ను చాలా జాగ్రత్తగా తీశాడు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


రాజ్ తరుణ్ అంధగాడు రిలీజ్ ఎప్పుడంటే : 


రాజ్ తరుణ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అంధగాడు సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు రైటర్ గా ఉన్న వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.


సినిమాలో అంధుడిగా నటిస్తున్న రాజ్ తరుణ్ జబర్దస్త్ కామెడీ అందిస్తాడట. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. కుమారి ఈడోరకం ఆడోరకం సినిమాలతో హిట్ పెయిర్ గా నిలిచిన ఈ క్రేజీ కాంబో ఈ అంధగాడుతో కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: