టాప్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో వారు నటిస్తున్న సినిమాలకు సంబంధించి కలక్షన్స్ రికార్డుల విషయంలో మాత్రమే కాకుండా వారు నటించిన సినిమాలకు అవార్డ్స్ వచ్చే విషయంలో కూడ విపరీతమైన పోటీ ఏర్పడింది. ముఖ్యంగా ఈ పోటీని టాప్ హీరోల అభిమానులు తమ వ్యక్తిగత ప్రతిష్టగా భావిస్తున్న నేపధ్యంలో ఈ టాప్ హీరోల మధ్య నడుస్తున్న రేస్ టాప్ హీరోల అభిమానుల మధ్య విపరీతమైన విద్వేషాలను సృష్టిస్తోంది.

ఈ వాతావరణానికి చెక్ పెట్టడానికి నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘ఐఫా’ అవార్డ్స్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ అనుసరించిన వ్యూహం ఈ అవార్డ్స్ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ లో 2016కు గాను ఉత్తమ నటుడి అవార్డ్ జూనియర్ కు వచ్చింది. ‘జనతా గ్యారేజ్’ మూవీలో జూనియర్ కనపరిచిన అద్భుతమైన నటనకు ఈ అవార్డ్ ‘ఐఫా’ కమిటీ ఇచ్చింది. 

అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ అవార్డ్ తీసుకోవడానికి వేదిక పైకి వచ్చిన జూనియర్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తనతోపాటు ఈ అవార్డ్ కు పోటీపడ్డ మిగతా హీరోల పేర్లు అన్నీ పేరుపేరునా చెపుతూ ఈ అవార్డ్ తన ఒక్కడిదే కాదని తనతో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కోసం పోటీపడ్డ అందరి హీరోలది ఈ అవార్డ్ అంటూ కామెంట్స్ చేసి ఈ అవార్డ్ ను తనతో పోటీపడ్డ అందరి హీరోలకు అంకితం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు జూనియర్.   

గతంలో ఇదే ‘ఐఫా’ అవార్డ్స్ ఫంక్షన్ లో శ్రీమంతుడు’ లో నటించిన మహేష్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చినప్పుడు అప్పట్లో జూనియర్ అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసారు. ఇప్పుడు అలాంటి విషయాలే మళ్ళీ పునరావృతం అవుతాయి అన్న ఉద్దేశ్యంతో ఈసారి తారక్ తనకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డును అందరి టాప్ హీరోలకు అంకితం ఇచ్చి తాను అందరి వాడిని అన్న సందేశం ఇవ్వడమే కాకుండా టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న వ్యూహాత్మక సందేశాన్ని చాల తెలివిగా ఇచ్చాడనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: