ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటా సామాజిక మాద్యమాల్లో ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు తమ అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు.  అయితే కొన్ని సార్లు ఇవి పాజిటీవ్ అయితే..కొన్ని సార్లు నెగిటీవ్ అవుతున్నాయి.  ముఖ్యంగా సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ తో ఫేస్ బుక్, ట్విట్టర్ లో అభిప్రాయాలు పెడుతూ...ఫోటోలు అప్  లోడ్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.  ఇక ట్విట్టర్ ని తన ఆయుధంగా ఉపయోగించుకుంటూ చిత్ర విచిత్రమైన కాంట్రవర్సీ ట్వీట్స్ పెడుతూ ప్రతి రోజూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ.  
Image result for katamarayudu new posters
ఇక చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్ ని అలాగే పవన్ ఫ్యాన్స్ ని వీరలెవల్లో తిడుతున్న దర్శకులు రాంగోపాల్ వర్మ కు పిండం పెట్టారు పవన్ ఫ్యాన్స్ . హఠాత్తుగా మరణించిన రాంగోపాల్ వర్మ ,సినీ పరిశ్రమ కి పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు సినీ ప్రముఖులు ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెబుతూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం అంటూ రాయడమే కాకుండా వర్మ ఫోటో చుట్టూ ఓ దీపం పెట్టి ఆర్జీవీ రిప్ అంటూ సోషల్ మీడియాలో వదిలారు. మరి ఆ డైరెక్టర్ మాత్రం తక్కువ తిన్నారా.. వెంటనే ఆయన కూడా ఓ కౌంటర్ వేశారు.
Image result for pawan kalyan ram gopal varma
లవ్ యూ మై డియర్ స్వీట్ డార్లింగ్..లవ్లీ బ్యూటిఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్..మీ అందరికీ నా బిగ్ హగ్ అని చురకలంటించాడు. నేను మూడు జన్మల ముందే చనిపోయాను.. ప్రస్తుతం బతికున్న దెయ్యాన్ని. ఈ విషయాన్ని నిరక్షరాస్యులైన గొర్రెలు గుర్తించడం లేదు.. దెయ్యాలు చనిపోవు..చావులోనూ బతికే ఉంటాయి అంటూ వెరైటీగా ట్వీట్ చేశాడు. గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ - రాంగోపాల్ వర్మ ల మధ్య ఈ లొల్లి సాగుతూనే ఉంది మరి ఈ లొల్లి కి ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.

వర్మ ట్విట్స్ :



మరింత సమాచారం తెలుసుకోండి: