తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటి చెప్పిన ఈ చిత్రం సీక్వెల్ గా బాహుబలి 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్, ట్రైలర్ కూడా అప్పుడే రికార్డుల మోత మోగిస్తూ..సినిమాపై విపరీతమైన అంచనా పెంచేస్తుంది.   బాహుబలి చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన ఫ్యూజువల్ వండర్స్ తో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.  
Baahubali, Baahubali release, Baahubali collections, Baahubali 2, Baahubali news, Baahubali box office
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో ఫాంటసీ చిత్రాలు, హిస్టారికల్ చిత్రాలు వచ్చాయి..కానీ ఈ చిత్రం వాటికి ఎంతో అడ్వాన్స్ గా ఉండటం చిత్ర ప్రత్యేకత.  ప్రస్తుతం బాహబలి 2 చిత్రం ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్.  ఇక నిన్న హైదరాబాద్ లో ఐఫా అవార్డుల కార్యక్రం అంగరంగ వైభవంగా సాగింది.  సినిమా ఇండస్ట్రీ దిగ్గజాలు అంతా  ఎంతో సందడి చేశారు.  ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు.  
Image result for ntr rajamouli
అక్క‌డ ఏర్పాటు చేసిన‌ ‘బాహుబలి వీఆర్‌’ జోన్‌కు వెళ్లి బాహుబ‌లి క‌త్తి, డాలు ప‌ట్టుకొని ఫొటోల‌కు పోజులిచ్చాడు. బాహుబ‌లి సినిమాలో ప్రభాస్‌ వినియోగించిన ఆయుధాలు ప‌ట్టుకున్న ఎన్టీఆర్ ఫొటోను ఆ సినిమా బృందం త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.  రాజమౌళి ఇండస్ట్రీలోకి ఎంట్రీ  ఎన్టీఆర్ తో ‘ స్టూడెంట్ నెం.1’ తో మొదలు పెట్టారు. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి సూప‌ర్ హిట్‌ సినిమాలను ఇచ్చిన విష‌యం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: