‘బాహుబలి-2’ ఆడియో విడుదల సందర్భంగా  తన ట్విట్టర్లో కొన్ని వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన కీరవాణిని టార్గెట్ చేస్తూ సంగీత దర్శకులు అదేవిధంగా కొందరు ప్రముఖ పాటల రచయితలు కీరవాణిని టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి  ముఖ్యంగా వేటూరి, సీతరామశాస్త్రి తర్వాత తెలుగు సినిమా పాట అంపశయ్య ఎక్కింది అని  కీరవాణి అన్న కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. 

ఈ పరిస్థితులలో పాటల రచయిత భాస్కరభట్ల ట్విట్టర్లో కీరవాణిని ఉద్దేశించి "అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణి గారే కాపాడగలరు. ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను. వేటూరి, సిరివెన్నెల తరువాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణి గారే!" అంటూ వ్యంగ్య బాణాలు వేసి అందరికీ షాక్ ఇచ్చాడు భాస్కర భట్ల.

ఇది చాలదు అన్నట్లుగా నిన్న రాత్రి జరిగిన  ‘ఐఫా’ అవార్డ్స్ కార్యక్రమం లో ‘జనతా గ్యారేజ్ లోని "ప్రణామం ప్రణామం" పాటకి వార్డు అందుకున్న రామజోగయ్య శాస్త్రి కూడా కీరవాణి వ్యాఖ్యలపై అంతర్లీనంగా సెటైర్లు వేసాడు. మంచి సందర్భం ఉంటే ఇప్పటి రైటర్స్ కూడా గొప్పగానే రాస్తారని, చెత్త సన్నివేశం ఇస్తే సీతారామశాస్త్రి అయినా చెత్తగానే రాస్తారని  అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి. 

ఇది ఇలా ఉండగా మరో  గీతరచయిత సిరాశ్రీ తన  ఫేస్ బుక్ లో కీరవాణిని ‘బాహుబలి’ పాటలో ఉన్న తప్పుల్ని చూపిస్తూ చేసిన కామెంట్ మరింత దుమారాన్ని లేపుతోంది.  "హేస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా".  అంటూ  "సాహోరే బాహుబలి" పాటలో వినిపించే పదాలకు తనకు అర్ధం తెలియక .. ఏకాక్షరీ నిఘంటువు ఆధారంగా ఈ పదాలకు అర్ధాలు వేదికానని అంతేకాదు  ఆపదాల అర్ధాలకోసం ఒక ప్రముఖ అవధానిని అడిగినా "ఈ పదాలకి అర్థం లేదు" అని ఆ ప్రముఖ అవధాని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించింది అంటూ సిరాశ్రీ కామెంట్ చేసారు. 

దీనితో అర్థం లేకపోయినా కొన్ని పదాల్ని కేవలం సౌండ్ కోసం క్రియేట్ చేసే సంగీత దర్శకుల లిస్టులో కీరవాణి కుడా చేరిపోయారా అంటూ కామెంట్ చేసాడు సిరా శ్రీ. ఏది ఏమైనా కీరవాణిని టార్గెట్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ రైటర్లంతా ఇలా బాణాలు వేస్తుంటే కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: