యంగ్ హీరోలలో నితిన్ చాలా సీనియర్. ఇప్పటికే టాప్ యంగ్ హీరోల లిస్టులో ప్రధమ స్థానంలో ఉండవలసి ఉన్న నితిన్  మధ్యలో వచ్చిన దాదాపు 12 వరస ఫ్లాపులమధ్య నితిన్ హీరోగా నిలదొక్కుకోవదానికే చాలా కాస్త పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వరస హిట్స్ తో  నిలదొక్కుకున్న నితిన్ గత ఏడాది విడుదలయిన ‘అ ఆ’ సూపర్ సక్సస్స్ కావడంతో నితిన్ కూడ 40 కోట్ల హీరోగా మారాడు. 

అయితే ఆ సక్సస్స్ ను కూడ పెద్ద్డగా ఉపయోగించు కోలేకపోయిన నితిన్ ఇప్పుడు ఎన్నో ఆలోచించి చేస్తున్న లేటెస్ట్  మూవీ ఫస్ట్ లుక్ ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ‘లై’ (LIE) అనే పేరు పెట్టారు.

దీనికి ట్యాగ్ లైన్ గా లవ్, ఇంటలిజెన్స్, ఎనిమిటీ అంటూ మూడు పదాలు తగిలించారు. ఇక లుక్ విషయానికొస్తే నితిన్ సరికొత్తగా ఇందులో కనిపిస్తున్నాడు అన్న కామెంట్స్ ఇప్పటికే వస్తున్నాయి.  ఇంత గడ్డం పెంచిన నితిన్ ను ఇంతకు ముందు ఎవరూ చూడలేదు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.  

దీనికితోడు బ్లాక్ షర్ట్, డిఫరెంట్ షేడ్స్ తో నితిన్  ఈ మూవీ కోసం చేసిన కంప్లీట్ మేకోవర్ కనిపిస్తోంది. కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సక్సెస్ తర్వాత హనురాఘవపూడి డైరక్ట్ చేస్తున్న మూవీ కావడంతో  ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 11వ విడుదల కాబోతున్న ఈ మూవీ వినాయక చవితిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. 

ఈ సినిమాలో కూడ నితిన్ చాలా చోట్ల తన దేముడిచ్చిన అన్నయ్య పవన్ నామస్మరణ చేసే సన్నివేసాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరి నితిన్ ఆడబోయే అబద్దాలు ఎంత వరకు నచ్చు తాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: