పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టాక్స్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్‌ లా వినిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ నిర్ణయం కారణంగా నిర్మాతకి కాసుల వర్షం కురుస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... పవన్ కళ్యాణ్‌ చిత్రం ‘కాటమరాయుడు’ ప్రస్తుతం థియోటర్స్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. 


బాక్సాఫీస్ ముందు సత్తా చూపిస్తోన్న ఈ చిత్రం అన్ని ఏరియాల్లో మంచి ఆధరణ అందుకుంటుంది. విడుదలైన రోజు నుండి ఇప్పటి వరకూ కాటమరాయుడు కలెక్షన్స్ నిలకడగా ఉండటమే కాకుండా ప్రత్యేక రోజుల్లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుతుంది.  ఇక ఈ చిత్రం కలెక్షన్స్ ని చూస్తే... ఏపి, తెలంగాణల్లో 37.6 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఉగాది పండుగరోజున ఈ కలెక్షన్లు భారీగా పెరిగాయని అంటున్నారు.


కాటమరాయుడు మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో..అప్పటి నుండి వరుసగా సెలవు రోజులు ఉండటంతో కాటమరాయుడుకి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ‘కాటమరాయుడు’ వసూళ్ళలో రోజు రోజుకి పెరుగుదల కనిపిస్తుంది. వరుస సెలవులు ఉంటాయనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌ రిలీజ్ డేట్ ని సరైన విధంగా ఎంచుకున్నారు. మొదట నిర్మాత ఈ మూవీని ఏప్రిలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ...మార్చిలోనే రిలీజ్ చేయాలని  పవన్ కళ్యాణ్‌ నిర్ణయం తీసుకోవటంతో ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది.


అందుకే నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల మొత్తం కలెక్షన్స్ 50 కోట్ల రూపాయలు కలెక్ట్‌ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ సైతం మిలియన్ మార్క్ ని దాటి బాక్సాపీస్ వద్ద దూసుకుపోతుంది. పవన్ సరికొత్త లుక్ లో కనిపించడం అనేది సినిమాకి ప్లస్ గా మారింది.  ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: