విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీపై ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. వెంటేష్‌ చేస్తున్న ఈ చిత్రం... తనకి సరికొత్త గుర్తింపుని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీలో వెంకటేష్‌ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు? అనేది అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ మార్చి 31న రిలీజ్ అవుతుంది.

అయితే ఒక్క రోజు ముందుగానే ఈ మూవీని పలువురు ప్రముఖులకి ప్రివ్యూలను వేసి చూపించినట్టుగా తెలుస్తుంది. దీంతో గురు మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో వినపిస్తున్న ప్రి రిలీజ్ రివ్యూ టాక్‌ పై పలు రకాలు వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... 116 నిమిషాల నిడివి గల ' గురు' చిత్రం ప్రేక్షకులకి ప్రత్యేకమైన  ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుందని చూసిన అంటున్నారు. ఇక గురు మూవీలో వెంకటేష్‌ బాక్సింగ్ కోచ్ గా కనిపించి కొత్త లుక్స్ లో అధరగొట్టారని చెప్పవచ్చు.

గడ్డం లుక్ లో వెంకీ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక సినిమాలో క్యారెక్టర్స్ ని చూస్తే...మురికివాడలకు చెందిన 'రాముడు' గా రితికా సింగ్ ఉంటారు. సినిమాలో వెంకీ, రితిక బాక్సింగ్ చేస్తున్న ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. అలాగే హీరోయిన్ కి వెంకీ కోచింగ్ ఇస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇక చిత్రంలో వస్తున్న ట్విస్ట్ లు సైతం ప్రేక్షకులను ఆక్టటుకునే లా ఉంటాయి చూసిన వారు చెబుతున్నారు.

నేషనల్ సెలెక్షన్స్ జరుగుతున్న సన్నివేశాలు చాలా ఎమోషనల్ ఉన్నాయట. ఆ  సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా గురు మూవీలో వెంకీ అద్భుతమైన నటనని చూపించారు. సినిమాకి ఇంటర్వెల్ సీన్ బాగుందని అంటున్నారు. హీరోయిన్ ఎదుర్కుంటున్న సమస్యలను చూపించిన విధానం బాగుంది. ఇక సినిమాలో జాకిర్ హుస్సేన్ పాత్ర చాలా బావుంది అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చిన బాక్సింగ్ మ్యాచ్ థ్రిల్ కి గురిచేసేలా ఉంటుంది. మొత్తంగా గురు మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: