తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ఈ మద్య సినిమాలు బాగా తగ్గించారు.   ఇక మల్టీస్టారర్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వెంకటేష్ ఆ మద్య ప్రిన్స్ మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘గోపాల గోపాల’ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి.  ‘దృశ్యం’ చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటించారు..ఇందులో హీరోయిజం ఏమీ లేకుండా బాధ్యత గల తండ్రి పాత్రలో అద్భతమైన నటన కనబరిచారు.  
Image result for telugu guru movie posters
గత సంవత్సరం మారుతి దర్శకత్వంలో హీరోగా ‘బాబు బంగారం’ చిత్రంతో బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్ అనిపించాడు.  తాజాగా వెంకటేష్  యాంగ్రీ బాక్సింగ్ కోచ్ గా నటించిన ‘గురు’ చిత్రం రేపు శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉంది.  ఈ చిత్రం బాలీవుడ్ లో  ‘సాలా ఖండూస్’ గా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఈ చిత్రాన్ని తమిళం లో ‘ఇరుద్ది సుట్రు’ గా రీమేక్ చేసారు. అక్కడకూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  తెలుగులో ఈ చిత్రాన్ని ‘గురు’ గా రిమేక్ చేస్తున్నారు. రిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన దర్శకురాలు సుధా కొంగర తెలుగులోకూడా దర్శకత్వ భాధ్యతల్ని చేపట్టారు. కాగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేడు ప్రీమియర్ షో ని వేశారు.  
Image result for sultan dangal
ఇక ప్రీమియర్ షో టాక్ ప్రకారం..సినిమా పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.  అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి వెంకటేష్ డిఫరెంట్ లుకింగ్ తో కనిపించడం..సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి.  వాస్తవానికి సబ్జెక్ట్ పరంగా చూస్తే..ఈ మద్య క్రీడలకు సంబంధించిన చిత్రాలు బాగా అలరిస్తున్నాయి..ఆ మద్య సల్మాన్ నటించిన ‘సుల్తాన్’, అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రాలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఉన్నాయి.
Related image
తాజాగా వెంకి నటించిన ‘గురు’ చిత్రం కూడా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిని బాక్సింగ్ చాంపియన్ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడతాడో..ఎన్ని అవమానాలు సహిస్తాడో ఈ చిత్రంలో చూపించారు.  అదే విధంగా ఓ మాస్ అమ్మాయి..క్లాస్ గా మారి బాక్సింగ్ లో తన సత్తా ఎలా చాటిందో రితికా సింగ్ కూడా చాలా అద్భుతంగా నటించింది. గురు శిష్యుల మధ్య జరిగే ఆసక్తికర ఆసక్తికర సన్నివేశాలతో మంచి సినిమాని చూశామన్న అనుభూతి కలుగుతుందని అంటున్నారు. సినిమాలలో అక్కడక్కకడా కాస్త బోరింగ్ సీన్లు ఉన్నా..సినిమా మాత్రం పరవాలేదు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: