తెలుగు సంగీత దర్శకుల్లో ట్రెండీ మ్యూజిక్ అందించడంలో మణిశర్మ ముందుండేవాడు. ఒకప్పుడు స్టార్ సినిమా అంటే అది కచ్చితంగా మణిశర్మ మ్యూజిక్ నుండే వస్తుంది. తన మ్యూజిక్ తో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న మణిశర్మ కొంతకాలంగా అవకాశాలను అందుకోవడంలో వెనుకడుగేశాడు. ఎప్పుడో ఒక సినిమా ఛాన్స్ వచ్చినా అది చిన్న సినిమా అవడం వల్ల అంతగా క్రేజ్ వచ్చేది కాదు.


ఇక ఈ క్రమంలో మణిశర్మకు మళ్లీ బ్రేక్ ఇచ్చాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. నాని హీరోగా వచ్చిన జెంటిల్మన్ సినిమాలో మణిశర్మ మ్యూజిక్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ తో జెంటిల్మన్ సక్సెస్ అందుకుంది.


ఇక అదే ఫాం కొనసాగిస్తూ ఈ తరం కుర్ర మ్యూజిక్ డైరక్టర్స్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు మణిశర్మ. ప్రస్తుతం మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న సినిమా లై. నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. మోషన్ పోస్టర్ తో హను అదరగొట్టగా ఆ పోస్టర్ లోనే మణిశర్మ మ్యూజిక్ టాలెంట్ చూపించేశాడు.   


ట్రెండీ మ్యూజిక్ కు అసలు సిసలైన అర్ధం చెప్పేలా మణిశర్మ లై సినిమాకు తన రేంజ్ ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ అందిస్తున్నాడని బిట్ మ్యూజిక్ చూసే చెప్పేయొచ్చు. ఇక నితిన్ లుక్ కూడా మరింత ఆకర్షణగా ఉన్న లై సినిమా 14 రీల్స్ బ్యానర్లో వస్తుంది. చూస్తుంటే నితిన్ కు భారీ హిట్ ఇచ్చేలా ఈ సినిమా తీర్చి దిద్దుతున్నట్టు కనిపిస్తుంది. రిలీజ్ కూడా భారీగానే చేసే ఆలోచనలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: