తెలుగు,తమిళ, మళియాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న హీరోయిన్ అమలాపాల్.  తెలుగులో నటించినవి కొన్ని చిత్రాలే అయినా ఈ అమ్మడికి మంచి పేరే సంపాదించింది.  ఈ మద్య కాలంలో అమలాపాల్ ఫిలిం న్యూస్ కన్నా ఆమె పర్సనల్ లైఫ్ పై ఎన్నో వార్తలు వస్తున్నాయి.  తమిళ దర్శకుడు 'విజయ్' ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్నాళ్ళకు వాళ్ళ వైవాహిక జీవితం కాస్త విడాకులు తీసుకున్నారు.  అమలా పాల్ వైవాహిక జీవితంపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.
Image result for అమలా పాల్ భర్త
అంతే కాదు ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన తొళినాళ్లలో భర్త తండ్రితో ఎఫైర్ పెట్టుకున్న సినిమాలో నటించి మహిళా సంఘలాచే చివాట్లు తిన్నది.  తాజాగా మరో వివాదంలో అమలాపాల్ సంచలనం రేపింది.  సాధారణంగా ఈ మద్య హీరోయిన్లు స్లిమ్ గా ఉండటానికి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు..ఈ నేపథ్యంలో యోగా ది బెస్ట్ అనడమే కాదు తాము చేసి మరీ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు అమలాపాల్ కూడా యోగా చేసి వివాదంలో చిక్కుకున్నారు.
amalapaul
అదేంటీ యోగా చేస్తే వివాదంలో చిక్కుకోవడం ఏంటా అనుకుంటున్నారా...! అవునండీ ఈ అమ్మడు యోగా చేస్తూ ఆమె తన కాళ్ళు బుద్దిడి మొహంపై పెట్టేలా ఫోటోలు దిగారు. ఇది చూసిన బుద్దుడి అభిమానులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ట్విట్టర్ లో అమలాపాల్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బౌద్దాన్ని అనుసరించే వారి మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వారు ఆ ఫోటోలను తొలగించాలని, క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై అమలాపాల్ ఏమంటారో వేచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: