ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయింది.  కొత్త హీరోలు, దర్శకుల, నిర్మాతలు తమ సత్తా చాటుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘పెళ్లి చూపులు’.  తాజాగా వెల్లడించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో "పెళ్లి చూపులు" చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.
Image result for పెళ్లి చూపులు
2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ సినిమాకు ఒక అవార్డు, పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కడం విశేషం. శతమాణం భవతి కూడా ఉత్తమ ప్రజాదరన పొందిన చిత్రం గా అవార్డు కొట్టింది. జనతా గ్యారేజ్ చిత్రానికి అవార్ద్ వస్తుందన్నది కొంత ఊహించిందే అయినా.., పెళ్ళి చూపులు మాత్రం ఇంత స్థాయిలో విజయ పతాక ఎగరేస్తుందని మాత్రం ఊహించలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సినిమా పెళ్లి చూపులు.

Image result for జనతా గ్యారేజ్

ఢిల్లీలో 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు  ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా...ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జా, ఉత్తమ తెలుగు ప్రజాదరణ పొందిన చిత్రం 'శతమానం భవతి'


వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇలా : 

జాతీయ ఉత్తమ నటుడు- అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

ఉత్తమ దర్శకుడు- రాజేష్ మాపుస్కర్ (వెంటిలేటర్)

ఉత్తమ సామాజిక చిత్రం- పింక్‌

ఉత్తమ సహాయనటుడు- జైరా వసీం

ఉత్తమ హిందీ చిత్రం-నీర్జా

ఉత్తమ తెలుగుచిత్రం-పెళ్లిచూపులు

ఉత్తమ సంభాషణలు- తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు)

ఉత్తమ నృత్య దర్శకుడు- రాజు సుందరం (జనతా గ్యారేజ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు- బాపు పద్మనాభ (కన్నడ)

బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్‌- శివాయ్‌

ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్‌

ఉత్తమ తమిళ చిత్రం - జోకర్‌

ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి

ఉత్తమ బాలల చిత్రం - ధనక్‌

ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ - పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)

ఉత్తమ నృత్యదర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)

ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)

ఉత్తమ సహాయనటుడు - మనోజ్ జోషి (దష్క్రియ)

ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - దీప్ చౌదరీ (అలిఫా)

ఉత్తమ గాయకుడు- సుందర అయ్యర్ (జోకర్)

ఉత్తమ గాయకురాలు- ఇమాన్ చక్రబొర్థీ (ప్రకటన్)

ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిగినల్) - శ్యాం పుష్కరణ్ (మహెశింటే ప్రతీకారం)

ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్) - సంజయ్ కిషంజీ (దష్క్రియా)

ఉత్తమ ఎడిటింగ్- రామేశ్వర్ ఎస్. భగత్ (వెంటిలేటర్) 

మరింత సమాచారం తెలుసుకోండి: