సినిమా అంటే అదో పిచ్చి.. సినిమా అంటే అదో రంగుల లోకం.. అందుకే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లయినా సినీ రంగానికి ఆకర్షితులవుతారు.. సినిమాల్లో కనిపించాలన్న 
కోరిక బలంగా కలిగిందింటే.. ప్రస్తుతం ఉన్న రంగం ఎలాంటిదైనా సరే.. పుల్ స్టాప్ పెట్టేసి చలో ఫిల్మ్ నగర్ అంటూ పరుగులు తీస్తారు. అలాంటిదే ఈ యంగ్ విలన్ కథ కూడా.



ఆ యంగ్ విలన్ సుబ్బరాజు.. అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, ఆర్య, పోకిరి, నేనున్నాను, దూకుడు వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సుబ్హరాజు బ్యాక్ గ్రౌండ్ ఏంటో 
సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసుకుంటే షాకవుతారు. ఆయనో కంప్యూటర్ స్పెషలిస్ట్. భీమవరంలోని డీయన్‌ఆర్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తరువాత కంప్యూటర్‌ కోర్సు 
చేశాడు. 


అందులో మంచి ప్రావీణ్యం సంపాదించడంలో హైదరాబాద్‌లోని డెల్‌ కంప్యూటర్స్‌లో జాబ్ వచ్చింది. డెల్ కంపెనీలో జాబ్ అంటే బిందాస్.. లైఫ్ సెటిలైనట్టే ఫీలవుతారు 
చాలామంది. కానీ సినిమాలపై ఉన్న ప్రేమ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ ఇంట్లోని కంప్యూటర్‌కు  ఏదో సమస్య వచ్చినప్పుడు ఓ 
మిత్రుడితో కలిసి వెళ్లి దాన్ని బాగు చేశాడట సుబ్బరాజు.


అలా పరిచయమైన కొద్ది సమయంలోనే  కృష్ణవంశీ సినిమాలపై సుబ్బరాజు ప్రేమ తెలుసుకుని.. తన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చాడట. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ అమ్మా 
నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలో పాత్ర సుబ్బరాజు నట జీవితాన్ని మలుపు తిప్పింది. అలా యంగ్ విలన్ గానూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సుబ్బరాజు తన ప్రతిభ 
చాటుకుంటున్నాడు. అదీ సుబ్బరాజు సినిమా స్టోరీ.



మరింత సమాచారం తెలుసుకోండి: