ఈ మద్య పెద్ద సినిమాలు వస్తుంటే..టాప్ హీరోల సినిమాలు సైతం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి.  ఇక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగు ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసిన చిత్రం ‘బాహుబలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ‘బాహుబలి 2’ ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతుంది.  సాధారణంగా సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాల విషయంలో వాతావరణం నెలకొనడం కొన్నేళ్ళుగా వస్తూ ఉంది. అయితే ఈ సారి బాహుబలి లాంటి బడా క్రేజ్ ఉన్న సినిమా రేసులో నిలవడంతో సినిమా రిలీజ్ తర్వాత నెల రోజుల వరకు మిగతా చిత్ర నిర్మాతలు వారి వారి సినిమాలను రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపడం లేదు.  
సీజన్‌ మిస్‌ అయిపోతున్న బన్నీ
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ నటిస్తున్న‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాన్ని మే 19 న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఏకంగా రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  మొత్తానికి సమ్మర్ రేస్ లో అల్లు అర్జున్ నేనట్లే అని తెలిసిపోయింది.  అయితే ఇదే డేట్ కి మరో యంగ్ హీరో ఫిక్స్ అయ్యాడట.  
Image result for rarandi veduka chuddam
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగ చైతన్య తన తాజా చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్ధాం’ని అదే తేదీన రిలీజ్ చేయాలనుకుంటున్నాడట.  సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఈ మధ్యే చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన టీం మూవీపై భారీ అంచనాలే పెంచింది.  మొత్తానికి సమ్మర్ సీజన్ లో బన్నీ ఔట్ కావడంతో చైతూ ఆ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: