తెలుగు లో వెంకటేష్ నటించిన ‘జెమిని’ , ‘ఎవడైతే నాకేంటి’ లాంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్‌ మణి కాలేయ వ్యాధితో కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  కానీ కళాభవన్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనపై విష ప్రయోగం జరిగిందని దాని కారణంగానే ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, మణి సోదరుడు ఆర్‌ఎల్‌వీ రామకృష్ణన్ పిటిషన్ దాఖలు చేశారు.  
kalabhavan mani
కాగా కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణ జరుపాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నెల రోజుల్లో కళాభవన్ మణి మృతిపై దర్యాప్తు పూర్తిచేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.ఇటీవలే కళాభవన్ మణి కుటుంబ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మృతిపై సీబీఐ విచారణ చేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
Image result for కళాభవన్ మణి
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో జెమిని, ఎవడైతే నాకేంటి తదితర చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా జానపద గాయకుడిగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మణి దాదాపుగా దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో నటించారు. విలనిజంలోనూ తనదైన కామెడీ ముద్రను వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: