ప్రపంచంలో మార్షల్ ఆర్ట్స్ లో పేరు పొందిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు.  బ్రూస్ లీ తర్వాత అంత గొప్ప పేరు సంపాదించింది ఒక్క జాకీచాన్ మాత్రమే.   తాజాగా ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ జాకీ చాన్ తాను ఎలాంటి పరిస్థితుల్లో తన ప్రియురాలిని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  కానీ అది అప్పట్లో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.  తాజాగా ఆ ఆ ఇంటర్వ్యూలోని విషయాలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. జాకీచాన్ తన ప్రియురాలు జోన్ లిన్‌ను 1982లో బలవంతంగానే వివాహం చేసుకున్నారట.
బలవంతంగా పెళ్లి
 సాధారణంగా చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇండస్ట్రీలో తాము చాలా సిన్సియర్ అని చెబుతూ ఉంటారు..కానీ జాకీచాన్ మాత్రం చాలా ఓపేన్ గా నిజాయితీగా  త‌న‌కు చాలానే ఎఫైర్లు ఉన్నాయ‌ని ప‌బ్లిగ్గా చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక‌పోయినా.. చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని అత‌ను చెప్ప‌డం విశేషం.
ఎన్నో ఎఫైర్లు
 వాస్తవానికి ఈ విషయాలను ఆయన 2015లోనే చైనా ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జాకీచాన్ ఈ విషయాల‌ను వెల్ల‌డించినా.. ఈ మ‌ధ్య అవి మ‌రోసారి నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ జోన్ లిన్‌ను 1982లో బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని దానికి కారణం ఆమె గ‌ర్భ‌వ‌తి అని తెలియ‌డం అని దాంతో తప్పని సరి పరిస్థితిలో ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అది కూడా ఓ చిన్న కాఫీ షాప్ లో అని చెప్పారు.   35 ఏళ్లుగా ఈ ఇద్ద‌రూ క‌లిసి ఉంటున్నారు..మా కుమారుడు జేసీ.
డగ్స్ వివాదంలో కుమారుడు
త‌న‌కు ఎంత మంది గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని అంతే కాదు తనకు అప్పట్లో పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదని అన్నారు.  లిన్ ను తాను పెళ్లి చేసుకోవడానికి కారణం తమ చైల్డ్ ఫ్యూచర్ కోసమే... ఆ పరిస్థితులు తనను పెళ్లి వైపు ఫోర్స్ చేసాయి.  ఇక జాకీ చాన్ కుమారుడు జైసీ చాన్ 2014లో మాదక ద్రవ్యాలు తీసుకున్న కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: