తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రాప‌ర్‌గా, ద‌ర్శ‌క‌హీరోగా త‌న‌దైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘ‌వ లారెన్స్ న‌టించిన తాజా చిత్రం ‘శివ‌లింగ’ ఏప్రిల్‌లో రిలీజ‌వుతోంది.   కామెడీ, హర్రర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కూడుకున్న ‘ముని’ చిత్రంతో తన జైత్రయాత్ర ప్రారంభించిన లారెన్స్ మొన్నటి ‘గంగ’ వరకు కొనసాగించాడు.

Image result for lawrence shivalinga

కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ తెలుగు, తమిళ భాషల్లో అదే పేరుతో రిమేక్ చేశారు.  అయితే నిన్న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది..కానీ తెలుగు మాత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ కాలేదు. నిన్న తమిళంలో రిలీజ్ అయిన శివలింగ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో లారెన్స్ మరో విజయం దక్కించుకున్నాడు.

Image result for lawrence shivalinga

ఆ మద్య ట్రైల‌ర్‌, పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అప్పటి నుంచి సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.  లారెన్స్ ‘కాంచన’, ‘గంగ’ ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా ‘శివలింగ’ అభిమానులను అలరించిందంటున్నారు.  శివ‌లింగ’ చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు. ఈ చిత్రంలో గురు హీరోయిన్ రితికా సింగ్ నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: