యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎన్.టి.ఆర్ కు సూపర్ స్టార్ డం తెచ్చిన సినిమా అది. అప్పటికే రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అవగా అదే కాంబినేషన్ లో వచ్చి సింహాద్రి అప్పటిదాకా ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్ధలు కొట్టింది. 


అయితే రాజమౌళి డైరెక్ట్ చేసిన సింహాద్రి కథ విజయేంద్ర ప్రసాద్ రాసిందే. అసలు ఈ కథ రాసింది తారక్ కోసం కాదట. నందమూరి బాలకృష్ణ కోసం ఈ కథ రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. అప్పుడు బాలయ్య డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో జూనియర్ దగ్గరకు వెళ్లింది ఈ కథ.


స్టూడెంట్ నెంబర్ వన్ తో తారక్ రాజమౌళిలి ఓ అండర్ స్టాండింగ్ తో ఉన్నారు. అదే కాంబినేషన్ లో సింహాద్రి సినిమా వచ్చింది. సింహాద్రికి ముందు ఎన్.టి.ఆర్ స్టార్ హీరో మాత్రమే సింహాద్రి సంచలనాల తర్వాత అతనో సూపర్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో భూమిక ఎపిసోడ్ వసంత కోకిల స్పూర్తితో రాశానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్.


ఒకవేళ సింహాద్రి కథ బాలయ్యే చేసుంటే వరకు ఆ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. కథ కథనాల్లో గ్రిప్పింగ్ తో పాటుగా రాజమౌళి టేకింగ్ సింహాద్రికి బాగా కలిసి వచ్చింది. జూనియర్ ఎన్.టి.ఆర్ ను యంగ్ టైగర్ గా, రాజమౌళి మార్క్ స్టాంప్ పడ్డ సినిమాగా సింహాద్రి సంచలనం సృష్టించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: