తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించి అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఎంటో చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడ్డారు.  ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఇలాంటి ఫ్యూజువల్ వండర్స్ చూపించలేదు.  కాగా ఈ చిత్రంలో క్లయిమాక్స్ లో పెద్ద ట్విస్ట్ పెట్టారు రాజమౌళి.  అమరేంద్ర బాహుబలి కి  నమ్మిన బంటు అయిన కట్టప్ప..ఆయనకు వెన్నపోటు పొడుస్తారు...ఎందుకూ? అన్న ప్రశ్న సమాధానం కావలంటే బాహుబలి సీక్వెల్ బాహుబలి 2 లో దొరుకుతుంది. 

Image result for kattappa killing bahubali

దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఉన్నారు.   అంత గొప్ప క్యూరియాసిటీ నెలకొల్పిన రాజమౌళి తాజాగా ఇప్పుడు బాహుబలి 2  దేశ వ్యాప్తంగా దాదాపు 75 శాతం థియేటర్లలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే కర్ణాటకలో ఈ సినిమాను అడ్డుకుని తీరుతాం అంటూ కన్నడ ప్రజా సంఘాల నాయకులు అడ్డుపడుతున్నారు.  గత కొంత కాలంగా కర్ణాటకలో కావేరీ జలాలలపై ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి.   తాజాగా తమిళనాడు తరుపు నుంచి ఈ విషయంలో కొంత మంది నటులు జోక్యం చేసుకొని కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.  

Image result for baahubali 2

ఈ క్రమంలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌ వల్ల కన్నడంలో విడుదల సమస్య మొదలైంది. తాజాగా బెంగళూరులో రాజమౌళి ఈ విషయమై మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయానికి ఇప్పుడు మా సినిమాను బలి చేయడం సమంజసం కాదు. ఆ వివాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే దయచేసి మా సినిమాను విడుదల కానివ్వండి అంటూ మీడియా ముందు కన్నడ ప్రజా సంఘాల వారిని రాజమౌళి కోరడం జరిగింది.  అంత పెద్ద కావేరీ జలాల విషయంలో రగిలిపోతున్న అక్కడి జనం మరి ‘బాహుబలి 2 ’ ని ఆదరిస్తారా..లేదా అన్న విషయం తెలిసియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: