తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అక్కడ ఎంతగా అభిమానులు ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ ఇండస్ట్రీలో తన సత్తా చాటాడు.  ప్రస్తుతం ఎక్కువ తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారు.  ఇక రజినీకాంత్ అల్లుడుగా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ మామ ఇమేజ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత స్టైల్లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, హిందీ ఇండస్ట్రీలో కూడా ధనుష్ కి అభిమానులు ఉన్నారు.  
Image result for pa pandi movie
కాకపోతే ఈ మద్య సుచీ లీక్స్ వ్యవహారంలో మనోడికి కాస్త డ్యామేజ్ అయ్యింది.  ఏప్రిల్ 14న తమిళంలో రిలీజ్ అయిన '' పా ... పాండి '' చిత్రం కలెక్షన్ల తో దుమ్మురేపుతుంది.  ఈ సినిమాలో అద్భుతమైన సెంటిమెంట్ తో పాటు చక్కటి హాస్యం, మాస్ చిత్రంగా తమిళ తంబీలకు తెగ నచ్చిందట. చక్కని సెంటిమెంట్ ఉన్న చిత్రంగా విమర్శకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.  ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు స్టార్ హీరో ధనుష్ దర్శకుడు కావడం.
Image result for pa pandi movie
తొలిసారిగా దర్శకత్వం చేపట్టి సూపర్ హిట్ ని అందుకున్నాడు ధనుష్. రిలీజ్ అయిన మార్నింగ్ షో నుండే పా పాండి చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.  ఇక మోహన్ బాబు ఈ వరుసలో ముందున్నాడు , ఎందుకంటే రజనీకాంత్ మిత్రుడు కాబట్టి అలా పా పాండి చిత్రాన్ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు . పైగా మోహన్ బాబు కు ఉన్న హిట్ చిత్రాలన్నీ కూడా రీమేక్ లు అన్న విషయం అందరికీ తెలిసిందే .



మరింత సమాచారం తెలుసుకోండి: