అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి వరుస విజయాల తరువాత అక్కినేని నాగచైతన్య తన మూవీలపై మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే తన మూవీలకి సంబంధించిన కథల విషయంలోనూ నాన్నగారి సలహాలను తీసుకుంటున్నారు.


దీంతో నాగార్జున తన కొడుకుల చిత్రాలకి తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే నాగాచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీకి సంబంధించిన న్యూస్ పై నాగార్జున షాక్ అయ్యాడు. హీరోగా నాగార్జున స్థాయిని మరోసారి భాక్సాపీస్ వద్ద చూపించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఇంత సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతోనే కొడుకు మూవీను రెడీ చేశారు నాగార్జున. దీంతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఇప్పడు సినీ వర్గాలను ఆశ్ఛర్యపరుస్తుంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తోంది. ఇలా పూర్తైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రానికి సంబంధించిన సీన్స్ ని నాగార్జున తాజాగా చూసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన ఎడిటింగ్ వెర్షన్ ని చూసిన నాగార్జున ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవుట్ పుట్ మొత్తం సోగ్గాడే చిన్నినాయన స్టైల్ లో ఉందట. నాగార్జునకి ఏది కావాలో..అదే విధంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించటంతో నాగ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


కథ మొత్తం సూపర్భ్ గా ఉందని, చిత్రీకరణ ఇంకా సూపర్భ్ అని నాగార్జున చెప్పుకొస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించిన ఇతర విషయాల్లోకి వెళితే… సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ రీ-రికార్డింగ్ ని మొదలుపెట్టనున్నారు. అలాగే నాగ చైతన్యకు బాగా కలిసొచ్చిన మే 19వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: