ఒకప్పుడు సినిమా  ఇండస్ట్రీలో పౌరాణిక చిత్రాలకు, జానపద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.  అకాలంలో దర్శకులు, నిర్మాతలు ఇలాంటి సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం వల్ల ఆ సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.  ఆ తర్వాత సాంఘిక చిత్రాలు తీయడం మొదలు పెట్టిన తర్వాత క్రైమ్, మాఫియా, లవ్, యాక్షన్ తరహా చిత్రాలు ఎక్కువ అయ్యాయి.  కాకపోతే ఈ మద్య మళ్లీ చారిత్రాత్మక చిత్రాలు, జానపద చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.  అదికూడా భారీ బడ్జెట్ తో అత్యద్భుతమైన ఫ్యూజువల్ ఎఫెక్ట్ తో తీస్తున్నారు.  
భీమునిగా వస్తున్న మెగాస్టార్..!
ఇందుకు ఉదాహరణ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ అని చెప్పోచ్చు.  అయితే బాహుబలి సినిమా కు ధీటుగా ఇప్పుడు మరో అత్యద్భుతమైన చిత్రం రాబోతుందట.  భారతీయులకు ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవంగా చెప్పుకునే చారిత్రాత్మక కథనాలు రామాయణం, మహాభారతం.  పౌరాణిక చిత్రాలు తీయాలన్నా, చారిత్రక సినిమాలు చేయాలన్నా అంత త్వరగా అయ్యే పనికాదు. ఎంతో పరిశోధన చేయాలి. ఎన్నో సన్నాహాలు చేసుకోవాలి. పైగా చిత్ర నిర్మాణానికి చాలాకాలం పడుతుంది కూడా.

రామాయణ, మహాభారత కావ్యాలను తెరకెక్కించాలంటే ఆ రోజుల్లో దర్శకులు, నటీనటులు ఎంతో శ్రమించారు. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా మహాభారతం పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు . వీఏ శ్రీకుమార్ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషలతో పాటు భారతీయ, విదేశీ భాషల్లో డబ్బింగ్ సినిమాగా విడుదల కానుంది. అయితే ఇందులో నటుల గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి.
Image result for mahabharat shahrukh aamir
భీముడి పాత్రకు మోహన్ లాల్, భీష్ముడి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు.  ఇక ఇప్పుడు కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు లేదా హృతిక్ రోషన్ నటించనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆమీర్ ఖాన్ ఆ మధ్య మహా భారతంలో కృష్ణుడి పాత్రని చేయాలనే కోరిక తనకి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ ముగ్గరిలో కృష్ణుడి పాత్ర ఎవరితో చేయిస్తారో తెలియాల్సి ఉంది.  

ఇక షారుఖ్ ఖాన్ దుర్యోధనుడిగా, అజయ్ దేవగణ్ కర్ణుడిగా, అక్షయ్ కుమార్ ధర్మరాజుగా నటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. హృతిక్ రోషన్ ఇటు కృష్ణుడి పాత్రలో అయిన లేదంటే అటుఅర్జునుడి పాత్రలో సరిగ్గా సరిపోతాడని నెటిజన్లు చెబుతున్నారు. ఇక నకులుడిగా సిద్దార్థ్ మల్హోత్రా.. సహదేవుడిగా వరుణ్ ధావన్ ల పేర్లను ఎక్కువమంది సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: