ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాహుబాలి మానియా పట్టుకుందీ అనడంలో అతిశయోక్తి లేదు.   తెలుగు ఇండస్ట్రీలో ఖ్యాతిని యావత్ భారత దేశం మొత్తం చాటి చెప్పిన గొప్ప ఫ్యూజువల్ వండర్ ‘బాహుబలి’.  ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం ఏంటో నిరూపించారు దర్శకధీరుడు రాజమౌళి. అంతే కాదు గత సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు కైవసం చేసుకుంది.   అయితే ఈ చిత్రంలో బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప వెన్నుపోటు పోడిచి చంపుతాడు..ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని  అభిమానులకు కుతూహలంగానే ఉంది.  
Image result for baahubali kattappa killing
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రాబోతుంది.  అయితే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ వాయిదా వేసుకొని నెల రోజులు గ్యాప్ ఇచ్చి మరీ రిలీజ్ చేస్తున్నారు.  కానీ ఓ యంగ్ హీరో మాత్రం బాహుబలిని  ఢీ కొట్ట బొతున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంలో ఒక హీరోగా నటించిన రాహుల్ దాని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు.  
Image result for venkatapuram posters
కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని రాహుల్ చేసిన సినిమా '' వెంకటాపురం '' . బాహుబలి 2 ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతుండగా ఏప్రిల్ 29 న వెంకటాపురం రిలీజ్ అవుతోంది . బాహుబలి ఓవర్ ఫ్లో తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు ఆ చిత్ర యూనిట్ .  మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: