తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి.  అందులోనూ ఎంత పెద్ద స్టార్ సినిమాలు వచ్చినా 50 కోట్లు కూడా వసూళ్లు చేయడం మరీ కష్టమవుతుంది.  తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ చిత్రం రిమేక్ గా వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు.  
Image result for khaidi no 150 posters
చిరంజీవి స్టామినా ఏంటో ఈ చిత్రంలో మళ్లీ చూపించారు. గత పది సంవత్సరాల క్రితం వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో అదే ఊపూ ఆయనలో కనిపించింది. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ లో ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు..అంతే కాదు బాస్ ఈజ్ బ్యాక్ అంటే అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఆరంభం రోజు నుండే భారీ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ కలెక్షన్లను వసూలు నాన్- బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే బాహుబలి రికార్డుల్ని దాదాపు టచ్ చేసింది కూడా.
Image result for khaidi no 150 posters
ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం నిన్నటితో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. వివివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి తమిళ కత్తి ఆధారం అన్న విషయం తెలిసిందే . చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . బాస్ చిత్రం వంద రోజులు పూర్తిచేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: