తెలుగు ఇండస్ట్రీలో పాత తరం నటీ, నటులు చాలా తక్కువ మందే ఉన్నారు.  ఇక భారతీయ సినిమా స్వర్ణ యుగం అని చెప్పుకొనే కాలంలో స్టార్ హీరోయిన్‌గా రాణించారు కృష్ణకుమారి.  అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో సాంఘిక చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి..కత్తి కాంతరావు తో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు.  ఒకప్పుడు వీరి జంట తెరపై వస్తే మంచి హిట్ అనేవారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారామె.
Image result for నటి కృష్ణకుమారి
అందం, అభినయం కలబోత అయిన కృష్ణకుమారి వివాహానంతరం కూడా కొన్ని సినిమాల్లో నటించారు.  తాజాగా సీనియర్ నటీమణి కృష్ణకుమారి ఆరోగ్యం విషయంలోనూ అలాంటి పుకార్లే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులోని ప్రముఖ హాస్పటల్‌లో కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆమె అభిమానులు కలవర పడ్డారు. ప్రస్తుతం కృష్ణకుమారికి 84 సంవత్సరాలు.
Image result for నటి కృష్ణకుమారి
అయితే ఆమె వయసు రిత్యా కొంత అనారోగ్యం చెందడం అందులోనూ  రక్తహీనత వల్ల ప్లేట్‌లెట్స్ క్షీణించాయని, దాంతో రక్తప్రసరణలో చిన్న సమస్య వచ్చిందని అన్నారు.  ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.  
Image result for నటి కృష్ణకుమారి
చికిత్సకు తన శరీరం చక్కగా సహకరిస్తోందని, ప్లేట్లెట్ కౌంట్ సైతం పెరిగిందని, ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో రూమర్స్ కారణంగా అనేకమంది ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారని, అయితే ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: