తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  రీసెంట్ గా తన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ లాంటి చారిత్రాత్మక చిత్రంతో బ్లాక్ బస్టర్ నమోదు చేసుకున్నాడు.  ఇక తండ్రి బాటలోనే నడుస్తూ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు.  హిందూ పురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాల్లో పాల్గొంటున్నారు.

 అయితే ఆ మద్య బాలకృష్ణ కనిపించుట లేదు అని వైసీపీ ఎమ్మెల్యేలు పోలీస్ కంప్లెంట్ చేసిన విషయం మరువక ముందే..మరో ఘరమైన అవమానం జరిగింది.  బాలయ్య హిందూపురం ఎం ఎల్ ఏ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఎండలు మండిపోతుండటంతో బాలయ్య నియోజకవర్గమైన హిందూపురంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది దాంతో ఆ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . . బిందె నీటిని పది రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో వేసవిలో ఈ తాగునీటి ఎద్దడి తో తట్టుకోలేక ప్రజలు రోడ్డుకు ఎక్కారు.
Image result for దున్నపోతుల మీద బాలయ్య
తమ ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి వచ్చి నెలలు గడిచిపోయాయి అని.. వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి దున్నపోతుల మీద బాలయ్య, తెలుగుదేశం పార్టీ, మున్సిపల్ కమిషనర్ ల పేర్లు రాసి.. నిరసన తెలిపి.. రాష్ట్రమంతటికీ తమ పరిస్థితిని అర్థం అయ్యేలా చేశారు హిందూపురం నియోజకవర్గం ప్రజలు. దున్నపోతుల మీద బాలయ్య పేరు రాయడమే కాకుండా వాటిని ఊరేగింపు గా తీసుకెళ్ళి మరింత సంచలనం సృష్టించారు . బాలయ్య ని దున్నపోతు లతో పోల్చి ఘోరంగా అవమానించడంతో విషయం బాలయ్య కు చేరింది . అయితే బాలయ్య మాత్రం మంచి నీళ్ళ ని పట్టించుకోకుండా తనని అవమానిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: