తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయనతో నటించిన ఓ హీరోయిన్ చాలా కాలం తర్వాత పవన్ ని కలిసి అరగంటకు పైగా భేటీ అయ్యింది.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..పవన్ కళ్యాన్ నటించిన ‘గోకులంలో సీత’ సినిమాలో నటించిన రాశి.   సాధారణంగా పవన్ కళ్యాన్ తన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడరు.  ముఖ్యంగా మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అంతే కాదు సినిమా వాళ్లను చాలా తక్కువగా కలుస్తాడు.
Image result for gokulamlo seetha movie
ఈ విషయం స్వయంగా ఆయనకు సన్నిహితులు తెలిపిన విషయాలు.  అయితే ఒకప్పటి బాలనటి, హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న రాశి ఈ మద్య పవన్ కళ్యాన్ ని కలిసిందట.  అంతే కాదు పవన్ కళ్యాన్ తో అరగంట సేపు భేటీ అయ్యిందట.  ఈ విషయం స్వయంగా రాశినే చెప్పింది.  తాను పవన్ కళ్యాన్ ని కలిసేందుకు ఆఫీస్ బయట ఎదురు చూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న పవన్ స్వయంగా వచ్చి తనను ఇంట్లోకి తీసుకు వెళ్లాడని కాసేపు పాత విషయాలు జ్ఞాపం చేసుకున్నామని ఇతర విషయాలు మాట్లాడామని చెప్పింది.
Image result for gokulamlo seetha movie
అంతా బాగుంది కానీ పవన్ తో అసలు రాశి అంత సీక్రెట్ ఏం మాట్లాడిందో అన్న విషయం మాత్రం చెప్పలేదు.  కాకపోతే పవన్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం.. తన భర్త పేరుతో నిర్మించి.. తానే స్వయంగా నటించిన లంక సినిమాను.. ప్రమోట్ చేయాలని.. పవన్ ను రాశి రిక్వెస్ట్ చేసిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: