బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఏదొక న్యూస్ తో ఇండస్ట్రీ హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది సల్మాన్ ఖాన్ కి సంబంధించిన విషయం అంటే చాలు…ఇక అందరూ తెగ ఆసక్తి చూపుతారు. తాజాగా ఓ బ్యూటీ సల్మాన్ ఖాన్ తో లెక్కలేనన్ని సార్లు డేట్ కి వెళ్ళాలని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… సల్మాన్ ఖాన్ ఇప్పటికి చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ ని కొనసాగించారని అంటారు.

అలాగే పలువురి హీరోయిన్స్ తో ప్రేమాయణం కూడ కొనసాగించారు. అయితే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుంటున్నప్పటికీ…తను మాత్రం ఇప్పటి వరకూ ఓ ఇంటి వాడు కాలేకపోయాడు. అయితే ఇంటి వాడు కాలేకపోతే ఏంటి…ఓ బ్యూటీతో మాత్రం తన రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయం తను చెప్పకపోయినా తన గర్ల్ ప్రెండ్ చెప్పటంతో ఇప్పుడు హాట్ టాక్స్ లా మారింది.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రుమేనియా భామ ఇలియా తో ఘాటు ప్రేమనే కొనసాగిస్తున్నారు. ఇటీవల సల్మాన్ తన మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగితే అక్కడి కూడ ఇలియా హాజరయ్యింది. ఇలియా తాజాగా బాలీవుడ్ కి చెందిన ఓ మీడియాతో చిట్ చాట్ చేసింది. అందులో ఈ బ్యూటీ టంగ్ స్లిప్ అయిందని అంటున్నారు. తను చాలా సార్లు సల్మాన్ ఖాన్ తో డేట్ కి వెళ్ళాలని…ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారని కూడ చెప్పింది.

ఇలియా ఈ విధంగా చెప్పటంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇప్పటి వరకూ సల్మాన్ తో డేట్ కి వెళ్ళామని ఏ హీరోయిన్ ఓపెన్ గా చెప్పలేదు. కానీ ఇలియా మాత్రం సల్మాన్ తో రిలేషన్ చేస్తున్నామని చెప్పటంతో వీరిద్దరూ పెళ్లిచేసుకునే ఆలోచనలో ఉన్నట్టు బిటౌన్ మీడియాలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సల్మాన్ ఇలియాకు ఓ భారీ గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: