బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సామాజిక చిత్రాలు నిర్మించి, నటించిన డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ ఇన్‌సాన్‌(డా.ఎం.ఎస్‌.జి) మరో కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారు.  డా.ఎం.ఎస్‌.జి లో ఎన్నో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉపయోగించి పిల్లల్ని, పెద్దలను ఆకర్షించిన గుర్ మిత్ తాజాగా ‘`జ‌ట్టు ఇంజ‌నీర్` తో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు.  సోష‌ల్ మెసేజ్‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా `జట్టు ఇంజ‌నీరింగ్‌`. డా.ఎం.ఎస్‌.జి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా `జ‌ట్టు ఇంజ‌నీర్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Image result for d msg posters

మరో ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని ఆయన కూతురు  హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌చేశారు. పేద‌రికం, నిరుద్యోగం, డ్ర‌గ్స్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడే గ్రామాన్ని ఓ ఉపాధ్యాయుడు ఎలా మార్చి ప్ర‌జ‌ల్లో ఎలాంటి మార్పు తెచ్చాడ‌నేదే క‌థ‌. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ మిష‌న్‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యుమ‌ర్‌తోపాటు ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుందని చిత్ర ద‌ర్శ‌కురాలు హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ తెలిపారు.  

Related image

ఈ చిత్రాన్ని 15రోజుల్లోనే చిత్రీక‌రించ‌డం విశేషం. డా.ఎం.ఎస్‌.జి న‌టిస్తున్న మ‌రో చిత్రం ఎం.ఎస్‌.జి ఆన్‌లైన్ గురుకుల్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రెండు పాట‌లుంటాయి. అందులో ఒక‌టి స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. ఈ రెండు సాంగ్స్‌ను డా.సెయింట్ డా.ఎం.ఎస్‌.జి కంపోజ్ చేసి పాడ‌టం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: