ఈ మద్య చాలా మంది సెలబ్రెటీస్ సోషల్ మాద్యమాల ద్వారా తమకు నచ్చింది..నచ్చని విషయాలు బాహాటంగానే వెల్లుబుచ్చతున్నారు.  ముఖ్యంగా ట్విట్టర్ లో అయితే ఏకంగా తమ సొంత విషయాలు కూడా బయటపెడుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు.  ఇక సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వాడకంలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ని మించిన ఘనడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు.  ప్రతిరోజు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.  తాజాగా ఇప్పుడు నటుడు  బ్రహ్మాజీ ట్విట్టర్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Image result for BRAHMAJI SON MARRIAGE

అయితే  ఈ న్యూస్ సినిమాల గురించి కాదు… ఆయన కుటుంబం గురించి తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ వార్త తెలపడంతో హాట్ టాపిక్‌గా మారింది. ‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని కూడా ఆయన తెలిపారు.

Image result for BRAHMAJI

ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని ట్విట్టర్ ద్వారా బ్రహ్మాజీ కోరుకున్నారు. అలాగే వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉండాలని అందరూ విషెస్ తెలపండంటూ ట్విట్ చేశాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ఓ సినిమా తీస్తున్నాడట… కాని ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై బ్రహ్మాజీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా సినిమాల విషయాలతో నే ఈ మద్య ఊదరగొడుతున్నారంటే..ఇప్పుడు ఇంటి విషయాలు కూడా బయట పెడుతూ ట్విట్టర్ సంచలనాలు సృష్టిస్తున్నారు. 

బ్రహ్మాజీ ట్విట్టర్ :


మరింత సమాచారం తెలుసుకోండి: